AP 10th Class Results 2022: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేడే పదో తరగతి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి. కాగా.. ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించనున్నారు.
AP 10th Class Results 2022: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి. కాగా.. ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించనున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఫలితాల కోసం డైరెక్ట్‌గా ఈ లింకును క్లిక్ చేయండి.. https://bse.ap.gov.in
దీనిని క్లిక్ చేసి.. 10 తరగతి ఫలితాలపై ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలతో ఫలితాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
కాగా.. కరోనా కారణంగా రెండేళ్లపాటు పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. 2019 తర్వాత మొదటి సారిగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..