AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28న భారీ జాబ్‌ మేళా! దరఖాస్తు లింక్ ఇదిగో..

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఉద్యోగ మేళ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28, 2026 (శనివారం) ఉదయం 9 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోజాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికె బాలాజీ తెలియజేసారు..

Job Mela 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28న భారీ జాబ్‌ మేళా! దరఖాస్తు లింక్ ఇదిగో..
Job Mela In Gannavaram Govt Polytechnic College
Srilakshmi C
|

Updated on: Feb 27, 2026 | 6:02 AM

Share

గన్నవరం, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఉద్యోగ మేళ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28, 2026 (శనివారం) ఉదయం 9 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోజాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికె బాలాజీ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెస్ట్ 2 బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిఐఈఎల్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి నరేష్ కుమార్ తెలిపారు.

జాబ్‌ మేళా ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కంపెనీలలో ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిటెక్(మెకానికల్, సివిల్) పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనం ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా  వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు సదరు జాబ్ మేళాకు రెజ్యూమెలతో లేదా బయోడేటా ఫోరమ్‌లతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలను తీసుకు రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

జాబ్‌ మేళా ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us