ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 164 ఉద్యోగాలు.. ఏయే క్రీడాకారులు అర్హులంటే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ICSIL).. ఒప్పంద ప్రాతిపదికన కోచ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టుల (Coach Posts) భర్తీకి..

ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 164 ఉద్యోగాలు.. ఏయే క్రీడాకారులు అర్హులంటే..
Icsil
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 9:25 PM

ICSIL Coach Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ICSIL).. ఒప్పంద ప్రాతిపదికన కోచ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టుల (Coach Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: 

మొత్తం ఖాళీల సంఖ్య: 164

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: కోచ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 46,374ల నుంచి రూ.62,356ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • కోచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సాయ్‌/ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ అర్హత పొందిన యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/ప్రపంచ చాఫింయన్‌షిప్‌లో మెడల్‌ సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

క్రీడలు: ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కబడ్డీ, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌ తదితర క్రీడలు.

  • అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సాయ్‌/ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ అర్హత పొందిన యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం/ద్రోణాచార్య అవార్డు గ్రహీతలయ్యి ఉండాలి.

క్రీడలు: అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, బాక్సింగ్‌, క్రికెట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ తదితర క్రీడలు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.