SIDBI Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. అర్హతలివే!

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్, వైస్ ప్రెసిడెంట్ (vice president) పోస్టుల భర్తీకి అర్హులైన..

SIDBI Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. అర్హతలివే!
Sidbi
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 9:07 PM

SIDBI Investment Principal Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్, వైస్ ప్రెసిడెంట్ (vice president) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: 

మొత్తం ఖాళీల సంఖ్య: 28

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్ వైస్ ప్రెసిడెంట్/ వైస్ ప్రెసిడెంట్ (1), ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్/ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్/ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ (5) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌, చార్టర్డ్ అకౌంటెంట్స్, పీజీ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruitment.sidbi@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.