Uttar Pradesh: కాన్పూర్ లో తీవ్ర ఉద్రిక్తత.. చెలరేగిన అల్లర్లు.. 40 మంది అరెస్టు
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మొహరించారు. శుక్రవారం చెలరేగిన అల్లర్లలో 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి మంది...
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మొహరించారు. శుక్రవారం చెలరేగిన అల్లర్లలో 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాన్పూర్ హింస తరువాత లక్నోలో(Lucknow) కూడా హైఅలర్ట్ ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తను కించపర్చారని ఓ వర్గం వాళ్లు ఆందోళన చేయడంతో శుక్రవారం భారీ హింస చెలరేగింది. పోలీసులపై అల్లరిమూకలు రాళ్లదాడి చేశాయి. పెట్రోబాంబులతో దాడికి పాల్పడ్డారు. దుకాణాలను బలవంతంగా మూయించడానికి ఓవర్గం ప్రయత్నించడంతో గొడవలు చెలరేగాయి. అల్లర్లకు పాల్పడిన వాళ్ల ఆస్తులను జప్తు చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘర్షణపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) స్పందించారు. శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తూనే ఈ ఘర్షణలకు కారణమైన నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మహ్మద్ ప్రవక్తపై ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో కాన్పూర్‌లో రెండు గ్రూపుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అల్లర్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఇటీవల జ్ఞానవాపి సమస్యపై వార్తా చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఆయన కామెంట్స్ ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు కారణమైంది. ఘర్షణల సమయంలో కాల్పులు వినిపించాయని, పెట్రోల్ బాంబులు కూడా ప్రయోగించారని వచ్చిన పుకార్లను పోలీసులు తోసిపుచ్చారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి