PM Kisan: మీరు పీఎం కిసాన్ పథకంలో డబ్బులు పొందుతున్నారా..? జూలై 31 వరకు గడువు పొడిగింపు.. లేకపోతే డబ్బులు రావు!
PM Kisan: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, సామాన్య ప్రజలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..
PM Kisan: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, సామాన్య ప్రజలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi) పథకం కూడా ఒకటి. ఈ పథకానికి కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి ఆధార్ నమోదును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో డబ్బులు పొందాలంటే లబ్దిదారుని ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ పూర్తిచేయడానికి ముందుగా 31 మార్చి, 2022 వరకు గడువు ఉండగా, దానిని మే 31వ తేదీ వరకు పొడిగించింది. అయినా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జులై 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా..?
☛ లబ్దిదారుడు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
☛ తర్వాత ఈ-కేవైసీ ట్యాబ్‌ని క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి.
☛ సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై ‘ఎంటర్ మొబైల్ నంబర్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
☛ ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నంబరు ఎంటర్ చేసి పక్కన ఉన్న ‘గెట్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.
☛ ఆ తర్వాత మీ మొబైల్ నంబరుకు 4 అంకెల OTP వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
☛ ఇప్పుడు మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు మరొక ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ పూర్తయినట్లే.
☛ ముఖ్యంగా ఈ పథకం నుంచి డబ్బులు పొందుతున్నవారు ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేస్తేనే మీ ఈకేవైసీ పూర్తవతుంది.
ఒక వేళ మీ మొబైల్ నంబర్ మారినట్లయితే ముందుగానే ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి కొత్త నంబర్‌ను నమోదు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త నంబరు ఆధార్‌కు అనుసంధానమైన తర్వాత పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈ-కేవైసీ నమోదు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి