Pizza Maker: ఫాస్ట్‌గా పిజ్జాలు చేసి రివార్డ్స్, అవార్డ్స్ పొందాడు.. కానీ ఇంతవరకు టేస్ట్ కూడా చెయ్యలే

లాస్ వేగాస్‌లో అత్యంత వేగవంతమైన పిజ్జా తయారీకి పోటీ జరిగింది.. ఈ పోటీల్లో న్యాయమూర్తుల సహా మొత్తం 8000 మంది పాల్గొన్నారు. జాగ్రోస్ ప్రతిభకు ప్రజలు ఫిదా అయ్యారు.

Pizza Maker: ఫాస్ట్‌గా పిజ్జాలు చేసి రివార్డ్స్, అవార్డ్స్ పొందాడు.. కానీ ఇంతవరకు టేస్ట్ కూడా చెయ్యలే
Worlds Fastest Pizza Maker
Follow us

|

Updated on: Jun 05, 2022 | 4:24 PM

Worlds Fastest Pizza Maker:  ప్రపంచంలో అనేక రకాల ఆహారపదార్ధాలు.. ఒకొక్క దేశంలో ఒకొక్క సంప్రదాయం వంటకాలు.. అయితే కొన్ని మాత్రం.. ఏ దేశంలో పుట్టినా.. ప్రపంచ వ్యాప్తంగా ఆహారప్రియులను ఆకర్షిస్తాయి. అలంటి ఆహారపదార్ధాల్లో ఒకటి పిజ్జా.. ఇటలీ లో పుట్టి.. అనేక దేశాల్లో హల్ చల్  చేస్తోంది. టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక రెస్టారెంట్ లో కూడా ఆర్డర్ ఇస్తే.. అరగంటలోనే ఇంటికి చేరుకుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి.. పిజ్జా తయారీలో సరికొత్త ప్రపంచ రికార్డ్ ను సృష్టించాడు.

బ్రిటన్‌లోని ఇరాకీ శరణార్థి జాగ్రోస్ జాఫ్ .. 70 సెకన్లలో మూడు పిజ్జాలను తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను ఈ ఫీట్ చేస్తుంటే ఎదురుగా ఉన్న జనం అతని స్పీడ్ చూసి ఆశ్చర్యపోయారు. లాస్ వేగాస్‌లో అత్యంత వేగవంతమైన పిజ్జా తయారీకి పోటీ జరిగింది..  ఈ పోటీల్లో న్యాయమూర్తుల సహా మొత్తం 8000 మంది పాల్గొన్నారు.  జాగ్రోస్ ప్రతిభకు ప్రజలు ఫిదా అయ్యారు. తన స్పీడ్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిజ్జా మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఇటువంటి పోటీలంటే ఇష్టం అంటున్న జాగ్రోస్ జాఫ్

ఇవి కూడా చదవండి

తన సత్తాను నిరూపించుకోవడానికి ప్రజల మధ్య పోటీ మధ్య జరిగే ఇలాంటి పోటీలంటే తనకు ఇష్టమని జాగ్రోస్ జాఫ్ చెప్పాడు. అంతేకాదు పిజ్జా చేయడం తనకు రోజువారీ పని అయినప్పటికీ..  ఇంత వేగంగా పిజ్జా తయారు చేయడం అంత తేలికైన పని కాదని జాగ్రోస్ జాఫ్ చెప్పాడు. పిజ్జా తయారీ పోటీల్లో పాల్గొనడానికి తాను 6-7 వారాల ముందునుంచే సాధన ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ పోటీలో మెనూల్లో భాగంగా పెప్పర్, మష్రూమ్, చీజ్ పిజ్జా ఎంచుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించి .. తన కష్టానికి తగ్గట్టుగానే ఈ అపూర్వ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు జాగ్రోస్ జాఫ్.

16 సంవత్సరాల క్రితం ఇరాక్ నుండి బ్రిటన్‌కు వచ్చిన జాగ్రోస్ .. డొమినోస్‌లో ఉత్తమ వర్కర్ గా ప్రశంసలను అందుకుంటున్నాడు. సంస్థ నుండి ఎప్పటికప్పుడు వివిధ అవార్డులను గెలుచుకున్న అతను తన పనిని అంకితభావంతో చేస్తాడు. జాగ్రోస్ గతంలో డొమినోస్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ , సూపర్‌వైజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాదు.. అతను మూడు సంవత్సరాల పాటు.. డొమినోస్ సంస్థకు యూరోపియన్ రికార్డును కూడా గెలుచుకున్నాడు. అయితే పిజ్జాలో ఎన్నో రికార్డ్స్ సృష్టించిన జాగ్రోస్ ఇప్పటి వరకూ ఫిజ్జా ఎలా ఉంటుందో రుచి కూడా చూడలేదట..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో