AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వైద్య ప్రమేయం లేని డెలివరీ కోసం ఓ మహిళ సాహసం.. సముద్రంలో అలల మధ్య పండంటి శిశువుకి జన్మ

Vital Video: ప్లయా మజగౌల్ తీరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చి అందరూ నోళ్లు తెరిచేలా చేసింది. అంతేకాదు జోసీ పీకెట్ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి మెడికల్ అసిస్టెన్స్ తీసుకోలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 27న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Viral Video: వైద్య ప్రమేయం లేని డెలివరీ కోసం ఓ మహిళ సాహసం.. సముద్రంలో అలల మధ్య పండంటి శిశువుకి జన్మ
Pacific Ocean
Surya Kala
|

Updated on: Jun 05, 2022 | 7:01 PM

Share

Viral Video: ఓ మహిళ పసిఫిక్ మహాసముద్రంలో ( Pacific Ocean) డెలివరీ అయిన వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసి సంచలనం సృష్టించింది. సముద్రం ఏమిటి.. డెలివరీ ఏమిటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజంగానే జరిగింది. 37 ఏళ్ల జోసీ పీకెట్ అనే మహిళ తనకు తానే స్వయంగా సముద్రం లో పురుడుపోసుకుని సంచలనం సృష్టించింది. నికరగ్వాలోని(Nicaragua) ప్లయా మజగౌల్ తీరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చి అందరూ నోళ్లు తెరిచేలా చేసింది. అంతేకాదు జోసీ పీకెట్ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి  మెడికల్ అసిస్టెన్స్ తీసుకోలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 27న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రసవ సమయంలో తాను ఎలా ఉత్సాహంగా ఉందో వెల్లడించింది. “తనకు మహాసముద్ర తీరంలో ప్రసవం అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఎలా సముద్రంలో జన్మనివ్వాలో ఆలోచిస్తూనే ఉన్నానని వివరించింది. అందుకోసం “వారం రోజుల ముందు నుంచి సముద్రం ఆటుపోట్లను పరిశీలించినట్లు పేర్కొంది. తాను ప్రసవించడానికి సరైన సమయం వచ్చినప్పుడు బీచ్ నాకు పుట్టబోయే బిడ్డకు సురక్షితంగా ఉంటుందని తనకు తెలుసనీ ఆ మహిళ వెల్లడించింది.

ప్రసవ వేదన మొదలవుతుందని తనకు వెలియడంతోనే  ఆమె పిల్లలు స్నేహితులతో కలిసి బసకు వెళ్లినట్లు తెలిపింది, అంతేకాదు ఆమె భాగస్వామి ఆమెను బర్నింగ్ టూల్ కిట్‌తో బీచ్‌కి తీసుకెళ్లారు. ఇందులో తువ్వాలు, జల్లెడతో కూడిన గిన్నె, గాజుగుడ్డ, పేపర్ టవల్స్‌ ఉన్నాయి. తరంగాలు సంకోచాల వలె అదే లయను కలిగి ఉన్నాయని.. మృదువైన ప్రవాహం తనకు ప్రసవ సమయంలో మంచి అనుభూతిని కలిగించిందని ఆమె వివరించింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ, “ఇప్పటికి.. ఎప్పటికీ. తమ స్త్రీలు.. వారి సామర్థ్యాలను విశ్వసించే వారికి మద్దతు ఇస్తూ.. స్త్రీలను హృదయాంతరాల నుంచి ప్రేమించే మరింత మంది పురుషులు ప్రపంచానికి కావాలని కామెంట్ జతచేసింది. ఈ వీడియోలో జోసీ తన సంకోచాలకు లోనవుతున్నప్పుడు మోకరిల్లినట్లు ఒక వీడియోలో ఉండగా.. మరొక క్లిప్‌లో పుట్టిన శిశువుని నీటిలో పట్టుకున్నట్లు రికార్డ్ అయింది. అప్పుడు బొడ్డు తాడు అలాగే ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు అద్భుతం, అందమైన, సామరస్యం, జన్మలక్ష్యం, స్ఫూర్తిదాయకమైన, నమ్మశక్యం కాని, భావోద్వేగ, అభినందనలు!!!” మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు, “ఓహ్… ఆ అలలు మీ చుట్టూ ఎంత మంచిగా వస్తున్నాయని నేను ఊహించలేనని కామెంట్ చేశారు.

” వీడియోపై ఓ లుక్కేయండి:

ఆమె కుమారుడికి బోధి అమోర్ ఓషన్ కార్నెలియస్ అని పేరు  పెట్టారు. ఇప్పటికే ఆ మహిళకు ఏడుగురు పిల్లలు ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..