Weight Loss Tips: సులువుగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Detox Drinks: డిటాక్స్‌ డ్రింక్‌ (Detox Drinks)లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని విషతుల్య పదార్థాలును తొలగిస్తాయి. జీవక్రియను కూడా వేగవంతం చేస్తాయి.

Weight Loss Tips: సులువుగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..
Detox Drinks
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

Detox Drinks: బరువు తగ్గడానికి రెగ్యులర్ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. ఇదే సమయంలో కొన్ని డిటాక్స్‌ డ్రింక్‌ (Detox Drinks)లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని విషతుల్య పదార్థాలును తొలగిస్తాయి. జీవక్రియను కూడా వేగవంతం చేస్తాయి. అంతేకాదు వీటిని తాగిన తర్వాత కూడా చాలా సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ డిటాక్స్ డ్రింక్స్ బరువు తగ్గించడంలో సహాయపడడంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి పనిచేస్తాయి. మరి అధిక బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి పానీయాలను ఆహారంలో చేర్చుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకుందాం రండి.

యాపిల్‌, క్యారెట్‌ డ్రింక్‌..

యాపిల్స్, దుంపలు, క్యారెట్‌లను ఉపయోగించి డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఈ మూడింటితో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైగా ఇందులో చాలా తక్కువ క్యాలరీలు కూడా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్, క్యారెట్ డ్రింక్‌..

నారింజ, క్యారెట్లు రుచిగా ఉండడమే కాకుండా పలు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ రెండిటిని మిక్స్ చేసి అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా బాడీ నుండి హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.

దోసకాయ, పుదీనా..

ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి చాలామంచివి. ఇవి మీ శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాదు రోజంతా ఎనర్జిటిక్‌ ఉంచడంలో సహాయపడతాయి. దోసకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు పదార్థాలను కలపడం ద్వారా మీరు డిటాక్స్ డ్రింక్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

దాల్చిన చెక్కతో..

ఒక జార్ నీటిలో కొన్ని యాపిల్ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, దాల్చిన చెక్కలను వేయండి. ఇప్పుడు అందులో నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 6 నుంచి 7 గంటల పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత వడబోసి తేనెను మిక్స్‌ చేయండి. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

మెంతి డిటాక్స్ డ్రింక్..

ఈ పానీయం తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వడపోసి దీనికి కొద్దిగా నిమ్మరసం కలపండి. ఆ తర్వాత ఖాళీ కడుపుతో దీన్ని సేవించాలి. ఇలా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..