Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..

Vikram Movie: యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ (kamal Haasan) నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం విక్రమ్‌ (Vikram). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు.

Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..
Vikram Amul
Follow us
Basha Shek

|

Updated on: Jun 06, 2022 | 7:52 PM

Vikram Movie: యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ (kamal Haasan) నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం విక్రమ్‌ (Vikram). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విక్రమ్‌ మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా కమల్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌కు అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది ఈ చిత్రం. ట్రేడ్‌ నిపుణుల అంచనాల మేరకు ఇప్పటికే రూ. 150కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే క్రియేటివ్‌గా యాడ్‌లను రూపొందించే ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ (Amul) విక్రమ్ సినిమాను ప్రశంసిస్తూ ఓ సూపర్బ్‌ డూడుల్‌ను రూపొందించింది.

సినిమాలో కమల్ ఒక చేత్తో గన్‌ పట్టుకుని, మరో చేత్తో బ్రెడ్, బట్టర్‌ను తింటున్న ఫొటోను క్రియేటివ్‌గా డిజైన్‌ చేసింది. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంంది. ‘విక్రమూల్’, ‘మాస్ కా ఎంటర్ టైన్‌మెంట్’ అనే పదాలను ఆ డూడుల్‌పై ప్రచురించింది. ‘కమల్ హాసన్ అద్భుతమైన ప్రదర్శనతో బ్లాక్‌బాస్టర్‌‌ను ఇచ్చారు’ అని క్యాప్షన్‌ కూడా ఈ పోస్ట్‌కు జత చేసింది. అమూల్‌ రూపొందించిన ఈ డూడుల్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. కాగా గతంలోనూ పుష్ప, కేజీఎఫ్‌ సినిమాలకు కూడా క్రియేటివిటీగా డూడుల్‌లను రూపొందించి ఆయా చిత్రబృందాలకు విషెస్‌ చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ICC Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ.. లిస్టులో ఎవరెవరున్నారంటే..

Castor Oil Benefits: పాదాల వాపు నుంచి కీళ్ల నొప్పుల ఉపశమనం వరకు.. ఆముదం నూనెతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు..

భారతదేశంలో ప్రారంభమైన Moto E32S విక్రయాలు.. ధరలు, ఫీచర్ల తదితర వివరాలివే..