Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: విరాటపర్వం ఓ అద్భుతం.. మరో అద్భుతమైన వెన్నెల సాయి పల్లవి.. హీరో రానా దగ్గుబాటి కామెంట్స్..

దర్శకుడు వేణు ఊడుగుల తన జీవిత కాలంలో చూసిన సంఘటనలతో 'విరాట‌ప‌ర్వం' అనే అద్భుతమైన సినిమా చేశారు.

Rana Daggubati: విరాటపర్వం ఓ అద్భుతం.. మరో అద్భుతమైన వెన్నెల సాయి పల్లవి.. హీరో రానా దగ్గుబాటి కామెంట్స్..
Rana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2022 | 6:41 PM

1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం విరాటపర్వం (Virata Parvam). ఇందులో టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలలో నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రానా రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా కర్నూలులో ఆదివారం విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే కర్నూల్ జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఈదురు గాలులు, వర్షం అంతరాయం కలిగించినప్పటికీ అభిమానులు, పబ్లిక్ సహకారంతో ఈవెంట్ విజయవంతగా జరిగింది. గాలులు, వర్షం కురుస్తున్నపటికీ అభిమానులు ప్రేక్షకులుని ఉద్దేశించి చిత్ర యూనిట్ మాట్లాడారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. “దర్శకుడు వేణు ఊడుగుల తన జీవిత కాలంలో చూసిన సంఘటనలతో ‘విరాట‌ప‌ర్వం’ అనే అద్భుతమైన సినిమా చేశారు. ”చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..” ఇలా నేను ఈ చిత్రంలో గొప్ప కవిత్వం చెప్పుకుంటూ వెళితే.. సాయి పల్లవి గారు వెన్నెల అనే మరో అద్భుతమైన వెన్నెల పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో హీరో సాయి పల్లవి. ఇది వెన్నెల కథ.” అన్నారు

ఇవి కూడా చదవండి

అలాగే.. నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘విరాట‌ప‌ర్వం’ చాలా అద్భుతమైన సినిమా కాబోతుంది. రానా గారు, సాయి పల్లవి గారితో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు ఊడుగులకి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ‘విరాట‌ప‌ర్వం’ ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కాబోతుంది. జూన్ 17న ప్రేక్షకులంతా థియేటర్ లో సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.