Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రోమో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న నాని.. నజ్రియా పెళ్లి సందడి వీడియో..

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 10న

Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రోమో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న నాని.. నజ్రియా పెళ్లి సందడి వీడియో..
Ante Sundaraniki
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2022 | 3:46 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani).. మలయాళ బ్యూటీ నజ్రీయా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). నజ్రీయా ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా అంటే సుందరానికీ ప్రోమో పాటను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన అంటే సుందరానికీ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయలతో నాని, నజ్రీయాల పెళ్లిని ఈ పాటను చక్కగా చూపించారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను దిగ్గజ సింగర్ శంకర్ మహదేవన్, శ్వేత మోహన్ లు ఆలపించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని.. హిందూ అబ్బాయి సుందరంగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.