Spark Movie: స్పార్క్ సినిమా కోసం హృదయం మూవీ మ్యూజిక్ డైరెక్టర్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హెష‌మ్ వ‌హాబ్‌ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..

Spark Movie: స్పార్క్ సినిమా కోసం హృదయం మూవీ మ్యూజిక్ డైరెక్టర్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
Spark
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2022 | 3:21 PM

యంగ్ హీరో విక్రాంత్.. అందాల ముద్దుగుమ్మ మెహ‌రీన్ ఫిర్జాదా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం స్పార్క్ (Spark). ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మే నెల‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటోంది.. ఈ చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించినప్ప‌టి నుంచే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తార‌ని మేక‌ర్స్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స్పార్క్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది రివీల్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హెష‌మ్ వ‌హాబ్‌ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ హృదయం సినిమాకు మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమాలోని ప్ర‌తి పాట ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. సూప‌ర్ స్టార్ డ‌మ్‌ను అందుకున్న హెష‌మ్ వ‌హాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ – స‌మంత జంట‌గా న‌టించిన ఖుషి సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా… ఇప్పుడు స్పార్క్ సినిమాకు కూడా హెష‌మ్ సంగీతాన్ని అందించ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే యూర‌ప్‌లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

Spark 1

Spark 1

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ