Sai Pallavi: అభిమానుల కోసం వర్షాన్ని లెక్కచేయని హీరోయిన్.. వానలోనే స్పీచ్ ఇచ్చిన సాయి పల్లవి..
డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విరాటపర్వం. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి (Sai Pallavi) తెలుగులో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిన విషయమే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కంటెంట్..హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. తన నటనతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దొచుకుంది. మేకప్ లేకుండా న్యాచురల్‌గా కనిపిస్తూ నటనతో ఆడియన్స్ ను మెప్పించింది. అంతేకాకుండా.. నెమలిగా నృత్యం చేస్తూ తెలుగువారి మదిలో నిలిచిపోయింది. స్టార్ హీరోలకు ఉండేంతా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని..లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ అభిమానుల నుంచి అందుకుంది. సాయి పల్లవి సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కవగానే ఉందని చెప్పుకోవాలి. తాజాగా విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిమానుల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్పీచ్ ఇచ్చింది సాయి పల్లవి. ఆమె స్పీచ్ కోసం వానలోనే నిల్చున్నారు అభిమానులు చూస్తుంటే ఆమె క్రేజీ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విరాటపర్వం. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం కర్నూలులో విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే విరాట పర్వం ట్రైలర్ లాంచ్ వేడుకలో అనుకోకుండా చిన్న అపశృతి చోటు చేసుకుంది. గాలివానకు స్టేజీ కూలిపోవడమే కాకుండా.. వెనకాల ఉన్న ఎల్ఈడీ స్టాండ్స్ పడిపోయాయి. సాధారణంగా ఇలా జరిగితే ఎవరైన ఈవెంట్ నుంచి వెళ్లిపోతారు.. కానీ సాయి పల్లవి మాత్రం అభిమానుల కోసం వర్షంలోనే స్పీచ్ ఇచ్చింది. ఆమె మాటలు వినేందుకు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వానలోనే నిలబడ్డారు ఫ్యాన్స్. ఒక హీరోయిన్ కోసం ఇంతగా అభిమానులు తరలిరావడం.. ఆమె స్పీచ్ కోసం వర్షంలోనే నిలబడడడం అంటే సాయి పల్లవి ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి వర్షంలో స్పీచ్ ఇచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Thankyou @RanaDaggubati ???? Gaaru for supporting @Sai_Pallavi92 Gaaru ??#SaiPallavi #RanaDaggubati #VirataParvam Trailer Launch Event Kurnool#VirataParvamOnJune17th ? pic.twitter.com/pHRBi7FOKk
— Ramesh Saipallavi_DHF❤️ (@92Saipallavi) June 6, 2022