Anil Ravipudi: తమన్నాతో గొడవలపై స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ మే 27న విడుదలైన థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది.

Anil Ravipudi: తమన్నాతో గొడవలపై స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే..
Anil Ravipudi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2022 | 3:02 PM

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఎఫ్ 3 (F3) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ మే 27న విడుదలైన థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో గానీ.. ఆ తర్వాత గానీ తమన్నా ఎక్కడా కనిపించలేదు.. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లలో అసలు తమన్నా పేరు వినిపించలేదు. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి.. తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్లపై స్పందించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తనకు తమన్నాకు మధ్య గొడవ జరగడం నిజమే అన్నారు. కానీ అదంత పెద్దదేమి కాదను.. సినిమా చేస్తున్నప్పుడు అంతమంది ఆర్టిస్టులను మేనేజ్ చేసేప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని తెలిపారు.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” సినిమా చేస్తున్నప్పుడు ఆర్టిస్టులను మేనేజ్ చేయడం అంత తేలికైన పని కాదు.. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. అందుకు ఉదయమే జిమ్ చేసుకోవాలి. టైం లేదు.. వెళ్లిపోవాలి అని మాట్లాడింది. దీంతో నాకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య ఆ హీట్ రెండు రోజులు నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇక ఆమె ప్రమోషన్లకు రాకపోవడానికి కారణం ఆమెకు వేరే షూటింగ్స్ ఉండడం.. ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో తనకు.. తమన్నా కు మధ్య గొడవలు జరిగాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి..కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 3 సినిమా థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.