Sathya Raj: పాత్ర నచ్చక పోయినా.. హీరో కోసమే నటించా. సత్యరాజ్‌ చెప్పిన ఆ సినిమా ఏంటంటే..

Sathya Raj: సత్యరాజ్‌.. అందరికీ ఈ పేరు తెలియకపోయినప్పటికీ. కట్టప్ప అంటే టక్కున గుర్తుపడతారు. బాహుబలి (Bahubali) సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు..

Sathya Raj: పాత్ర నచ్చక పోయినా.. హీరో కోసమే నటించా. సత్యరాజ్‌ చెప్పిన ఆ సినిమా ఏంటంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2022 | 1:52 PM

Sathya Raj: సత్యరాజ్‌.. అందరికీ ఈ పేరు తెలియకపోయినప్పటికీ. కట్టప్ప అంటే టక్కున గుర్తుపడతారు. బాహుబలి (Bahubali) సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యరాజ్‌. ఈ సినిమా తర్వాత వచ్చిన పాపులారిటీతో సత్యరాజ్‌కు సౌత్‌లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బడా హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తూ మెప్పించారు. ఇక బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సత్యరాజ్‌ నటించిన విషయం తెలిసిందే. పేరుకు బాలీవుడ్‌ చిత్రమే అయినా ఈ సినిమా నేపథ్యమంతా చెన్నైలో జరుగుతున్నట్లు ఉంటుంది.

ఇదిలా సత్యారాజ్‌ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై సత్యారాజ్‌ మాట్లాడుతూ.. ‘2013లో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు నా పాత్ర వినగానే.. అది నాకంత గొప్ప పాత్రగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుఖ్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టితో చెప్పాను. కానీ, చివరికి షారుఖ్‌పై ఉన్న అభిమానంతో ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే, షారుఖ్‌ అంటే నాకెప్పటి నుంచో అభిమానం.

ఆయన నటించిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ ఎన్నోసార్లు చూశా’ అని చెప్పుకొచ్చారు. షారుఖ్‌పై ఉన్న అభిమానం, అతని నటనపై ఉన్న ఇష్టంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాకు ఓకే చేశానని సత్యరాజ్‌ చెప్పుకొచ్చారు. సినిమా విడుదలైన ఇన్నేళ్ల తర్వాత సత్యరాజ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే