AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Castor Oil Benefits: పాదాల వాపు నుంచి కీళ్ల నొప్పుల ఉపశమనం వరకు.. ఆముదం నూనెతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు..

Castor Oil Benefits: Castor Oil Benefits: పని ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల్లో వాపు, నొప్పి వస్తుంది. వాస్తవానికి ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లలో రక్త సరఫరా తగ్గుతుంది. దీని కారణంగా కండరాల్లో నొప్పులు వస్తాయి. కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనంతగా మారుతుంది.

Castor Oil Benefits: పాదాల వాపు నుంచి కీళ్ల నొప్పుల ఉపశమనం వరకు.. ఆముదం నూనెతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు..
Castor Oil Benefits
Basha Shek
|

Updated on: Jun 06, 2022 | 6:10 PM

Share

Castor Oil Benefits: పని ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల్లో వాపు, నొప్పి వస్తుంది. వాస్తవానికి ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లలో రక్త సరఫరా తగ్గుతుంది. దీని కారణంగా కండరాల్లో నొప్పులు వస్తాయి. కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనంతగా మారుతుంది. చాలామంది ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ ను ఆశ్రయిస్తుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆముదం నూనె (Castor Oil) బాగా పనిచేస్తుంది. కాళ్లలో వాపు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదంతో పాదాలకు మసాజ్ చేస్తే కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దీని వల్ల మనిషికి ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. మరి వీటితో పాటు ఆముదం ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి.

పాదాల వాపును తగ్గిస్తుంది..

ఆముదం నూనెలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే అనేక గుణాలు ఉంటాయి. దీనికి ఆముదం కూడా బాగా ఉపయోగపడుతుంది. వేడి చేసిన ఆముదం నూనెను ఆముదం ఆకులపై రాసి, కాళ్లలో వాపు ఉన్నచోట కట్టాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆముదం ఆకులు లేకపోతే, ఆముదంతో వాపు ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేసి, గుడ్డతో కప్పి ఉంచాలి. రాత్రంతా అలా ఉంచితే వాపు సమస్యలు తగ్గిపోతాయి.

ఇవి కూడా చదవండి

గాయాలు మానడంలో..

ఆముదం నూనెలోని గుణాలు గాయాలను నయం చేయడంలో బాగా సహాయపడతాయి. అదేవిధంగా కణజాల పెరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అందుకే గాయాలు తగిలినచోట ఆముదం నూనెను రాస్తే త్వరగా మానుతాయి.

కీళ్ల నొప్పుల నుంచి..

ఆముదం నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో మసాజ్ చేస్తే చాలా మంచిది. కావాలంటే, మసాజ్ చేసిన తర్వాత మీరు లైట్ కంప్రెసెస్ కూడా చేయవచ్చు.

పగిలిన మడమలకు..

మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి కూడా ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి, ఆముదంతో చీలమండలపై మసాజ్ చేయాలి. దీని వల్ల మడమల పగుళ్లు తగ్గిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

భారతదేశంలో ప్రారంభమైన Moto E32S విక్రయాలు.. ధరలు, ఫీచర్ల తదితర వివరాలివే..

Rafael Nadal Love Story: 14 ఏళ్ల పాటు ప్రేమలో.. ఆపై లగ్జరీ రిసార్ట్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌.. రఫెల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?

Godse: గాడ్సే సినిమా కోసం గొంతు సవరించుకున్న సత్యదేవ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..