Curd: పెరుగు తిని వెంటనే ఈ 6 ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. ప్రమాదంలో పడినట్లే!

పెరుగు లేకుండా మధ్యాహ్నం లంచ్ ఎవ్వరికీ పూర్తి కాదు. పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి...

Curd: పెరుగు తిని వెంటనే ఈ 6 ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. ప్రమాదంలో పడినట్లే!
Curd
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2022 | 1:33 PM

పెరుగు లేకుండా మధ్యాహ్నం లంచ్ ఎవ్వరికీ పూర్తి కాదు. పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో ఉండే కాల్షియం.. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇదిలా ఉంటే చాలామందికి ఉదయాన్నే పెరుగు, పంచదార కలిపి తినడం అలవాటు.. ఇది శారీరికంగా, మానసికంగా ఎంతగానో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని పదార్ధాలను మాత్రం పెరుగుతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఆ పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. పెరుగు, చేప – పెరుగు, చేపలు కలిపి అస్సలు తినకూడదు. దీనికి కారణం లేకపోలేదు. రెండింటిలోనూ అధిక ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే వాటిని కలిపి తింటే అజీర్ణంతో పాటు చర్మ సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

2. పెరుగు, పాలు – పెరుగుతో పాటు పాలు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

3. పెరుగు, ఉల్లిపాయ – చాలామందికి పెరుగన్నంలో ఉల్లిపాయ కలుపుకుని తినడం అలవాటు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. పెరుగేమో శరీరాన్ని చల్లపరుస్తుంది.. ఉల్లిపాయ వేడిని పెంచుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. దద్దుర్లు, సోరియాసిస్, గ్యాస్ సమస్య, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు

4. పెరుగు, మామిడికాయ: పెరుగు తిన్న వెంటనే.. లేదా పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు. ఎలర్జీలు, చర్మ సమస్యలు తలెత్తవచ్చు.

5. పెరుగు, నూనె పదార్ధాలు – పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన ఆహార పదార్ధాలను అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే.. అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు.

6. పెరుగు, మినపప్పు – పెరుగు తిని వెంటనే మినపప్పుతో చేసే వంటకాలు తినకండి. దీని వల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.