- Telugu News Photo Gallery Rafael Nadal Love Story: Rafael Nadal's wife Maria Francisca Perello is very glamorous and fashionable.. their love story is very interesting
Rafael Nadal Love Story: 14 ఏళ్ల పాటు ప్రేమలో.. ఆపై లగ్జరీ రిసార్ట్‌లో గ్రాండ్ వెడ్డింగ్.. రఫెల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
Tennis : ఫ్రెంచ్ ఓపెన్ 2022 ఫైనల్‌లో రాఫెల్ నాదల్ తన 100% విజయాల రికార్డును కొనసాగించాడు. అతను 14వ సారి ఫైనల్‌కు చేరుకున్నాడు. అదేవిధంగా ప్రతిసారి టైటిల్‌ను గెలుచుకుంటూ వస్తున్నాడు.
Updated on: Jun 06, 2022 | 5:18 PM

స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌ను కింగ్ ఆఫ్ ది క్లే కోర్ట్ అని పిలుస్తారు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించాడు. ఐదో ర్యాంక్‌లో ఉన్న నాదల్ 6-3, 6-3, 6-0తో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను ఓడించి 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు.

36 ఏళ్ల రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నాదల్‌కి ఇది 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. చెరో 20 టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ రెండో స్థానంలో ఉన్నారు.

నాదల్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతను ఉండే ప్యాలెస్ విలువ రూ.30 కోట్లు. ఈ ప్యాలెస్‌ను 2013లో కట్టించాడు. రఫెల్ కు రూ.1,500 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.

రఫెల్ సతీమణి పేరు మారియా పెరెల్లో. ఆమె కూడా తరచుగా నాదల్ మ్యాచ్‌లు చూడడానికి వస్తుంటుంది. కాగా పిల్లల్ని కనడంపై నాదల్ ఓ సందర్భంలో స్పందిస్తూ.. తనకు తండ్రి కావాలనుకుంటున్నానని, అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

నాదల్ భార్య మరియా పెరెల్లో వృత్తిరీత్యా ఓ బీమా ఏజెంట్. ఆమె రాఫా నాదల్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. నాదల్ భార్య మరియా పెరెల్లో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను నెట్టింట్లో పంచుకుంటుంది.

నాదల్, మరియా ఫ్రాన్సిస్కా పరేలో 2005లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు 14 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లిపీటలెక్కారు. స్పెయిన్‌లోని అత్యంత ఖరీదైన రిసార్ట్ లా ఫోర్టలేజాలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

మైదానంలో బెబ్బులిలా విజృంభించే నాదల్ కోర్టు బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. రాఫెల్ నాదల్ తన స్నేహితురాలు మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోను 2019లో వివాహం చేసుకున్నాడు.




