- Telugu News Photo Gallery Viral photos Mukhesh Ambanis Host Event For Son's Fiancee Radhika Merchant
Radhika Arangetram: ముఖేష్ కాబోయే కోడలు రాధిక ఆరంగ్రేటం.. ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్న భరత నాట్య ప్రదర్శన
Radhika Merchant: భారతదేశ కుభేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా దంపతుల రెండో తనయుడికి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యంలో ఆరంగేట్రం చేసింది. ఈ వేడుకను ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభంగా నిర్వహించారు.
Updated on: Jun 06, 2022 | 1:38 PM

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ , అతని భార్య నీతా అంబానీ తమకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ భరతనాట్యం ఆరంగేట్రం వేడుకను నిర్వహించారు. నీతా అంబానీ పూల ప్రింట్‌బోర్డర్ ఉన్న నారింజ రంగు ఉన్న పట్టు చీరలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రణ్‌వీర్ సింగ్ ఎర్రటి కుర్తాలో మ్యాచింగ్ మాస్క్ , సన్ గ్లాసెస్‌తో ఈవెంట్‌కి హాజరు

సల్మాన్ ఖాన్ ఫార్మల్ లుక్ లో బ్లేజర్, ముదురు నీలం రంగు షర్ట్‌లో కనిపించారు.

ఈ కార్యక్రమంలో, ముఖేష్ అంబానీ తన మనవడు పృథ్వీ , కొడుకు ఆకాష్ , కోడలు శ్లోకా మెహతాతో ఫోటోలకు పోజులిచ్చారు.

రాధికా మర్చంట్ పారిశ్రామికవేత్త విరెన్ మర్చంట్ కుమార్తె. ఆరంగేట్రం అనేది ఒక నర్తకి శాస్త్రీయ నృత్యంలో అధికారిక శిక్షణను పూర్తి చేయడం. వేదికపై తొలి ప్రదర్శన ఇవ్వడం

రాధికా మర్చంట్‌కు 2019లో అనంత్ అంబానీతో నిశ్చితార్థం జరిగింది.

రాధికా మర్చంట్ శ్రీ నిభా ఆర్ట్స్ గురు భావన థాకర్ శిష్యురాలు. రాధిక మర్చంట్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆహుతులను కట్టిపడేసింది.

భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, సాగరిక కూడా హాజరయ్యారు

మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తన తల్లి రష్మీ థాకరే, సోదరుడు తేజస్ థాకరేతో కలిసి జియో వరల్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
