Viral Video: సీతాకోక చిలుకను పెట్టుకోవడానికి పట్టుదలతో ప్రయత్నిస్తోన్న పెంగ్విన్ల బృందం.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video: అందమైన, అమాయకమైన పనులను చేస్తోన్న ఈ పెంగ్విన్లను చూడడం అద్భుతం. అందుకే వీటికి సంబంధించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసినా వైరల్‌గా మారుతుంది.
Viral Video: పక్షుల్లో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి పెంగ్విన్. ఇవి ఎగరలేని పక్షులు. అయితే నీటిలో తేలతాయి. ఇక 900 అడుగుల లోతు వరకూ ఈజీగా ఈదుతుంది. వీటి రెక్కలు నీళ్లలో తడవవు. అంటే వాటర్‌ప్రూఫ్. పెంగ్విన్లు సముద్రపు నీరును తగ్గుతాయి. అదే సమయంలో పెంగ్విన్లు తమ శ్వాసను దాదాపు 20 నిమిషాలు అదుపులో ఉంచుకుంటాయి. వీటితో పాటు.. ఈ పక్షులు ఒంటరిగా కంటే.. ఎక్కువగా గ్రూప్స్ గా నివసించడానికి, సరదాగా గడపడానికి ఇష్టపడతాయి. పెంగ్విన్లు సరదాగా గడిపే విధానం చూస్తే.. ఎవరికైనా తమ బాల్యం మదిలో మెదులుతుంది. తమ చిన్ననాటి రోజులను గుర్తుతెచ్చుకుంటారు. అయితే ప్రస్తుతం పెంగ్విన్ పక్షులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియోలో పెంగ్విన్లు.. సీతాకోకచిలుకను పట్టుకోవడంలో బిజీబిజీగా ఉన్నాయి.
Penguins chasing a butterfly.. ? pic.twitter.com/ynP6oW49zm
— Buitengebieden (@buitengebieden) June 4, 2022
సీతాకోకచిలుకను పట్టుకోవడానికి పెంగ్విన్‌ల బృందం సంతోషంగా దాని వెంట పరుగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. అందమైన, అమాయకమైన పనులను చేస్తోన్న ఈ పెంగ్విన్లను చూడడం అద్భుతం. అందుకే వీటికి సంబంధించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసినా వైరల్‌గా మారుతుంది.
అందమైన ఈ వీడియో బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 40 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన తర్వాత..ఈ సీతాకోకచిలుక తన ఎగిరే సామర్థ్యంతో పెంగ్విన్లను ఓ ఆట ఆడుకుంటుంది. అయినప్పటికీ నేను వీటిని ప్రేమిస్తున్నాను వంటి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..