Viral Photo: ఈ ఫోటోలో మీరు మొదటిగా చూసేది మీరేం కాబోతున్నారో చెప్పేస్తుందోయ్!

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఇవి మన మెదడుకు పని చెప్పడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి..

Viral Photo: ఈ ఫోటోలో మీరు మొదటిగా చూసేది మీరేం కాబోతున్నారో చెప్పేస్తుందోయ్!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2022 | 11:10 AM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి మీరు చూసే విధానాన్ని సవాల్ చేస్తుంటాయి. మనం చూసేదే మన వ్యక్తిత్వం అని చెప్పేస్తుంటాయ్. ఆయా చిత్రాల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. ఇంటర్నెట్‌లో చాలా రకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని చూసేందుకు విచిత్రంగా ఉంటాయి. అప్పుడప్పుడూ మన కళ్లను మభ్యపెడుతుంటాయి. వాటినే ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) అని అంటారు.

ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడంలో మనకొక రిలాక్సేషన్ వస్తుంది. అందులో ఉన్న జంతువునో, వస్తువునో కనిపెడితే.. మనకు కిక్కొస్తుంది. తాజాగా అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో ద్వారా మీ డ్రీమ్ జాబ్ ఏంటో చెప్పేయొచ్చు అని YourTango.comలోని ఓ కథనం చెబుతోంది. మొదటిగా ఈ ఫోటోలో మీరు దేన్నీ చూస్తున్నారో.. అదేంటో చెప్పండి..

నత్త:

మొదటిగా నత్తను చూసినట్లయితే.. ఆ వ్యక్తులు వారి వాయిస్‌‌ను ఉపయోగించగలిగే ఉద్యోగాల్లో ఎక్కువగా రాణిస్తారు. టీచర్, బస్సు డ్రైవర్, సామాజిక కార్యకర్త, సింగర్ లాంటి ఉద్యోగాల్లో ఎదగగలరు.

పుర్రె:

మొదటిగా మీరు పుర్రెను చూసినట్లయితే.. మీలో సృజనాత్మకత దాగి ఉందని అర్ధం. యాక్టర్, డ్యాన్సర్, పెయింటర్ లాంటి ఉద్యోగాలు మీకు చక్కగా సరిపోతాయి.

మ్యాప్:

మీరు మొదటిగా ఫోటోలో మ్యాప్‌ను చూసినట్లయితే.. ప్రతీ విషయాన్ని మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు.. విషయానికి సంబంధించిన వివరాలను లోతుగా తెలుసుకోవాలనుకుంటారు. మీ డ్రీమ్ జాబ్ ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ లేదా సైన్స్‌లో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..