AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ వీడియో అన్నిటికంటే భిన్నం.. కొత్త ఇంట్లోకి అత్తగారికి హారతి ఇచ్చి సాంప్రదాయంగా ఘన స్వాగతం పలికిన కోడలు..

Viral Video: ఇప్పటి వరకూ గృహ ప్రవేశానికి చెందిన అనేక రకాల వీడియోలు చూసి ఉంటారు. అయితే ఈ వీడియో అన్నిటికంటే అద్భుతమైంది. కొత్త ఇంట్లోకి అత్తగారి గృహ ప్రవేశం అత్యంత మనోహరం

Viral Video: ఈ వీడియో అన్నిటికంటే భిన్నం.. కొత్త ఇంట్లోకి అత్తగారికి హారతి ఇచ్చి సాంప్రదాయంగా ఘన స్వాగతం పలికిన కోడలు..
Viral Video
Surya Kala
|

Updated on: Jun 06, 2022 | 11:44 AM

Share

Viral Video: ప్రపంచ దేశాల్లో భిన్నమైనవి భారతదేశంలోని ఆచారసాంప్రదాయాలు. ముఖ్యంగా మన దేశంలో గత కొన్నేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా ఉమ్మడి కుటుంబం స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. అయితే అన్నదమ్ములు, తాతయ్య నానమ్మ, అమ్మమ్మ, బాబాయ్, పిన్ని, అక్క చెల్లి వంటి బంధాలు అనుబంధాలకు ఇప్పటికి విలువనిస్తూనే ఉన్నారు. పండగలు, ఫంక్షన్లు. వంటి ఏ సందర్భం వచ్చినా ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట కలుస్తారు. సంతోషముగా గడుపుతారు.  అయితే అత్తా కోడళ్ల రిలేషన్ పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది అత్తలు.. తమ ఇంటికి వచ్చే కోడలిని కూతురులా భావించి.. ఘన స్వాగతం చెబుతూ తమ ఇంటికి ఆహ్వానించేవారున్నారు. అంతేకాదు.. కోడలిని అత్తమామల కాక సొంత తల్లిదండ్రులుగా మారి ప్రేమను పంచేవారున్నారు. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా తమ అత్తగారిని కొత్త ఇంటికి ఆహ్వానిస్తూ.. సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం చెప్పింది కోడలు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో సుమారు 60ఏళ్ళు ఉన్న ఓ మహిళ అపార్ట్మెంట్ లోని లిప్ట్ నుంచి దిగి కొత్త ఇంటిలోకి రావడానికి రెడీ అయింది. అయితే ఇంతలో కోడలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో పల్లెంలో హారతిని తీసుకుని వచ్చి.. గుమ్మం దగ్గర తన అత్తగారికి హారతినిచ్చి స్వాగతం చెప్పింది. అనంతరం ఆ వృద్ధురాలి మనవలు.. తమ నాన్నమ్మకి హారతినిచ్చారు. పెద్దల దీవెనలను తీసుకున్నారు. కోడలు చూపిన ప్రేమతో అత్తగారి కంట్లో ఆనందభాష్పలు వచ్చాయి. గుమ్మం లోనుంచి ఇంట్లో అడుగు పెట్టె సమయంలో కూడా ఆమె నడిచే ప్రాంతంలో పువ్వులను పరిచారు. ఆ పువ్వుల మీద నడుస్తున్న సమయంలో తల్లిని కొడుకు పట్టుకుని.. తన తండ్రి ఫోటో వద్దకు తీసుకుని వెళ్ళాడు. అనంతరం ఆ కుటుంబ పెద్దయిన అత్తగారు.. దేవుడి పూజా మందిరం దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి కోడల్లే కదా సనాతన హిందూ ధర్మానికి ఆదర్శం అని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకూ గృహ ప్రవేశానికి చెందిన అనేక రకాల వీడియోలు చూసి ఉంటారు. అయితే ఈ వీడియో అన్నిటికంటే అద్భుతమైంది. కొత్త ఇంట్లోకి అత్తగారి గృహ ప్రవేశం అత్యంత మనోహరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అత్త అమ్మయినప్పుడు.. కోడలు కూతురవుతుంది అంటూ తమ సంతోషని తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో