Viral Video: స్కూటీని ఇలా కూడా వాడతారా.. నెట్టింట వైరల్ వీడియో.. చూస్తే మైండ్‌బ్లాంకే..

ఎండ వేడిమి ఎంతగా ఉందంటే హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఏకంగా తన స్కూటీ సీటుపై వేడి వేడిగా దోసె వేసుకుని తినేంతగా ఉందంటూ చెప్పుకొస్తు్న్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.

Viral Video: స్కూటీని ఇలా కూడా వాడతారా.. నెట్టింట వైరల్ వీడియో.. చూస్తే మైండ్‌బ్లాంకే..
Dosa On Vespa Scooty Viral
Follow us
Venkata Chari

|

Updated on: Jun 06, 2022 | 12:25 PM

Dosa On Scooty: ఎండాకాలం ఎండలు దంచికొడుతుంటాయి. ఇక రోహిణీ కార్తెలో అయితే, చెప్పనక్కర్లేదు. ఎన్నడూ లేనంగా గరిష్ట స్థాయిని తాకి, జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి అచ్చం ఇలాంటి పరిస్థితిని వివరించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి చేసిన వీడియో నెట్టింట్లో ఆకట్టుకుంటూ, తెగ వైరలవుతోంది. ఎండలకు తాళలేక వర్షాల కోసం ఎదురుచూస్తోన్న జనాలను కూడా ఈ వీడియో అద్దం పడుతోంది. ఇక అసలు ఈ వీడియోలో ఏముందో ఓసారి చూద్దాం..

ఎండ వేడిమి ఎంతగా ఉందంటే హైదరాబాద్లో ఓ వ్యక్తి స్కూటీ సీటుపై వేడి వేడిగా దోసె వేసుకున్నా డు. దీన్ని వీడియో తీసి, ఇంటర్నెట్లో షేర్ చేశాడు. నెటిజన్లు కూడా తమ కామెంట్లతో ఎండలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అంటూ కొట్టిపారేస్తు్న్నారు. కాగా, ఇలాంటి కేసులు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా కొందరు కారు బానెట్‌పై ఆమ్లెట్ వేసి చూపించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో వెస్పాపై దోసను తయారు చేసినట్లు వీడియోలో చూడొచ్చు. దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించకండి అంటూ క్యాఫ్షన్ అందించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..