IND vs SA: ఫ్లాప్ అయితే కెప్టెన్సీ రేసు నుంచి ఔట్.. కేఎల్ రాహుల్ ఘోరమైన రికార్డులకు చెక్ పడేనా?

దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ రాహుల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ఎందుకంటే ఇది బహుశా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్‌గా అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సిరీస్‌లో రాహుల్ బాగా రాణిస్తే, సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచుతారు.

IND vs SA: ఫ్లాప్ అయితే కెప్టెన్సీ రేసు నుంచి ఔట్.. కేఎల్ రాహుల్ ఘోరమైన రికార్డులకు చెక్ పడేనా?
Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Jun 05, 2022 | 8:20 AM

భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ కోసం, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కెప్టెన్ రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, జట్టు కమాండ్ మరోసారి కేఎల్ రాహుల్ చేతికి చేరింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రాహుల్ ఇటీవలే IPL-2022లో కొత్తగా ప్రారంభించబడిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ విజయాన్ని టీమిండియాతో పునరావృతం చేస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

దీని వెనుక చాలా కారణాలున్నాయి. కెప్టెన్‌గా రాహుల్ రికార్డు ఏమంత బాగోలేదు. అయితే అతను ఇప్పటికీ టీమ్ ఇండియా కెప్టెన్ రేసులో నిలిచాడు. కెప్టెన్సీ విరాట్ కోహ్లి చేతి నుంచి పోయినప్పటి నుంచి రాహుల్ కెప్టెన్ రేసులో ఉంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనే టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేసినప్పుడు, రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

చెత్త రికార్డ్..

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా కెప్టెన్‌గా రాహుల్ రికార్డు చూస్తుంటే మరీ దారుణంగా ఉంది. జోహన్నెస్‌బర్గ్‌లో అతను కెప్టెన్‌గా వ్యవహరించిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించి ఓడిపోయాడు. కోహ్లి, రోహిత్‌ల కెప్టెన్సీలో కనిపించిన దూకుడు, చాతుర్యం రాహుల్ కెప్టెన్సీలో కనిపించడం లేదు. ఇది అతని కెప్టెన్సీలో అతిపెద్ద బలహీనతగా పరిగణిస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా అతను రెండేళ్లపాటు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, జట్టును ప్లేఆఫ్‌కు కూడా తీసుకెళ్లలేకపోయాడు. అతను ఖచ్చితంగా ఈ సీజన్‌లో లక్నోను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ అనుభవంతో మంచి కెప్టెన్‌గా ఎదుగుతారని, అవసరమైనప్పుడు టీమిండియాను హ్యాండిల్ చేస్తారని భావిస్తున్నారు.

ఫ్లాప్ అయితే ప్లేస్ పోతుంది..

దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ రాహుల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ఎందుకంటే ఇది బహుశా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్‌గా అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సిరీస్‌లో రాహుల్ బాగా రాణిస్తే, సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచుతారు. కానీ, అతను విఫలమైతే మార్పులు చూడవచ్చు. టీమిండియాకు ఇప్పుడు వైస్-కెప్టెన్/కెప్టెన్ ఎంపిక ఉంది. ఈ రేసులో రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. పంత్, బుమ్రా కూడా వైస్ కెప్టెన్లుగా ఉన్నారు. దీంతో ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ ముందు చాలా పెద్ద ప్రమాదం నిలిచింది. మరి ఎలా రాణిస్తాడో చూడాలి.