Viral News: రొటీన్ వర్క్ .. ఉద్యోగం బోరు కొడుతోందని ఏడాదికి రూ.3.5 k కోట్ల జీతం వస్తున్న ఐటీ జాబ్‌కి గుడ్ బై..

మైకేల్ లిన్ కు ఏడాదికి రూ. 3. 5 కోట్ల జీతంతో పాటు.. రకరకాల ఆహారం, కారు, బంగ్లా ఇతర అలవెన్సులు వంటి అనేక సౌకర్యాలను నెట్ ప్లిక్స్ కల్పించింది. అయితే ఉద్యోగం బోర్ కొడుతోంది.. అంటూ.. రిజైన్ చేశాడు.

Viral News: రొటీన్ వర్క్ .. ఉద్యోగం బోరు కొడుతోందని ఏడాదికి రూ.3.5 k కోట్ల జీతం వస్తున్న ఐటీ జాబ్‌కి గుడ్ బై..
Michael Lin
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2022 | 9:52 AM

Viral News: మనిషి జీవితం.. ఇక నుంచి కరోనాకి ముందు .. తర్వాతగా చెప్పునే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషిపై ఈ వైరస్  శారీరకంగా ఆర్థికంగానే కాదు.. మానసికంగా కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వీలుని కల్పించింది. అయితే వర్క్ ఎట్ హోమ్ ఇవ్వగానే మొదట ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు చాలా మంది ఉద్యోగుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇంటి దగ్గర పనిచేయాలంటే బోర్ అవుతున్నారు.. అలా బోర్ ఫీల్ అయిన ఓ ఉద్యోగి ఏడాదికి కోట్ల శాలరీ ఇస్తున్న కంపీనీకి గుడ్ బై చెప్పేశాడు.  వివరాల్లోకి వెళ్తే..

అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే ఇంజనీర్ అమెజాన్ లో ఉద్యోగిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. అనంతరం మంచి జీతం వస్తుందని.. అమెజాన్ కు గుడ్ బై చెప్పేసి.. 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు. మైకేల్ లిన్ కు ఏడాదికి రూ. 3. 5 కోట్ల జీతంతో పాటు.. రకరకాల ఆహారం, కారు, బంగ్లా ఇతర అలవెన్సులు వంటి అనేక సౌకర్యాలను నెట్ ప్లిక్స్ కల్పించింది. అంతేకాదు.. అదనంగా మైకేల్ లిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు.. సెలవు పెట్టుకునే వీలుని అదనంగా ఇచ్చింది. అది కూడా పెయిడ్ లీవ్ సదుపాయం ఇచ్చింది.

అయితే ఇలాంటి ఉద్యోగం బోర్ కొడుతోంది.. అంటూ.. రిజైన్ చేశాడు. తనకు కరోనా ఇంట్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్థుల్లో ఒకలాంటి రొటీన్ ఫీలింగ్ ఏర్పడింది. వర్క్ ఎట్ హోమ్ తో కొలీగ్స్ తో కలిసి సరదాగా పనిచేయడం.. కంపెనీ ఏర్పటు చేసే ఫన్నీ మూమెంట్స్ అన్ని మిస్ అయ్యాయి.. అయితే పని భారం మాత్రం మరింతగా పెరిగిందని  మైకేల్ లిన్  భావించాడు. దీంతో వెంటనే మేనేజ్ మెంట్ ను కల్సి జాబ్ రోల్ మార్చమని కోరాడు.. అయితే వారు వీలు లేదని చెప్పడంతో.. ఉద్యోగానికి రిజైన్ చేశాడు.

జీవితంలో డబ్బులు వస్తున్నాయి.. కానీ ఎదో కోల్పోతున్న భావం.. సంతోషం మిస్ అవుతున్నానని  చెప్పాడు. అయితే తాను ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్న సమయంలో తన తల్లిదండ్రులు, స్నేహితులు వద్దు అన్నా.. తర్వాత తన నిర్ణయానికి మద్దతునిచ్చారని తెలిపాడు. 2021 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసిన మైకేల్ తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?