Godse: గాడ్సే సినిమా కోసం గొంతు సవరించుకున్న సత్యదేవ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Satyadev’s Godse: ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది. ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అపడేట్‌ను ప్రకటించింది చిత్రబృందం.

Godse: గాడ్సే సినిమా కోసం గొంతు సవరించుకున్న సత్యదేవ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Satyadev's Godse
Follow us
Basha Shek

|

Updated on: Jun 06, 2022 | 4:35 PM

Satyadev’s Godse: వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో సత్యదేవ్‌(Satyadev). కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అతను ఇప్పుడు హీరోగానూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో గాడ్సే (Godse) కూడా ఒకటి. గతంలో సత్యదేవ్‌తో బ్లఫ్‌ మాస్టర్ వంటి సూపర్‌ హిట్ సినిమాను రూపొందించిన గోపి గణేష్ ఈ సినిమాకు దర్శకుడు. సి. కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువ‌కుడిగా సత్యదేవ్‌ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఐశ్వర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది. ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అపడేట్‌ను ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమా నుంచి ‘రార‌మ్మంది.. ఊరు’ అంటు సాగే పాట‌ను రేపు (జూన్ 7న) విడుద‌ల చేయ‌బోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా స‌త్య దేవ్ ఈ పాట‌ను హమ్‌ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ..’నేను పాడితేనే సాంగ్‌ ఇంత బాగుంది. మరి రామ్ మిరియాల పాడితే ఇంకెంత బాగుంటుంది. గాడ్సే సినిమా నుంచి ఈ పాట రేపు విడుద‌ల కాబోతుంది’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గాడ్సే సినిమాలో నాగబాబు, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సిజ్జూమీనన్‌, మాథ్యూ వర్గీస్‌, పృథ్వీ రాజ్‌, ప్రియదర్శి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సత్యదేవ్‌ హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరయిన్‌గా నటించింది.అదేవిధంగా హిందీలో అక్షయ్‌ కుమార్‌ రామ్‌సేతు, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు సత్యదేవ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Shruthi Haasan: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్‌.. వివాహ బంధంపై నమ్మకమున్నా..

F3 Movie collections: నవ్వుల బొనాంజాకు బాగా కలిసొచ్చిన వీకెండ్‌.. మొత్తం10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

Bonalu 2022: తెలంగాణలో బోనాల జాతర.. 30న గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు