Bonalu 2022: తెలంగాణలో బోనాల జాతర.. 30న గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం..

Bonalu 2022: ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తదితరులు

Bonalu 2022: తెలంగాణలో బోనాల జాతర.. 30న గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం..
Bonalu 2022
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 09, 2022 | 5:37 PM

Bonalu 2022: తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి తలమానికంగా భావించే బోనాల ఉత్సవాలు ఈ నెలఖారు నుంచి  ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తదితరులు క‌లిసి బోనాల వేడుక‌పై స‌మీక్ష నిర్వహించి జాతర తేదీల‌ను ఖరారు చేశారు.అనంతరం సమావేశం వివరాలకు మంత్రి తలసాని మీడియాకు వెల్లడించారు. ఈనెల 30న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడంతో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భ‌విష్యవాణి కార్యక్రమం నిర్వహించ‌నున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాల‌యాల ఘ‌ట్టాల ఊరేగింపు జరపనున్నారు. జులై 28న గోల్కొండ బోనాల‌తో ఈ ఉత్సవాలు ముగియ‌నున్నాయి.

ఘనంగా బోనాలు నిర్వహిస్తాం..

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బోనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్, నగరానికి చెందిన MLA లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IND Vs SA: సౌతాఫ్రికా నెట్ బౌలర్‌గా భారత క్రికెటర్‌.. అతని వయస్సు తెలిస్తే షాక్‌ అవుతారు..

Viral: ఆన్‏లైన్‏లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా..

TS TET 2022: టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.