Fake news alert: టీవీ9 పేరుతో ఫేక్ వీడియో సర్క్యులేషన్.. ఆకతాయిలకు శిక్ష తప్పదు
ప్రజలందరికీ అలెర్ట్. టీవీ9 పేరుతో ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. టీవీ9లో ప్రసారం అయినట్లుగా ఓ వీడియో క్రియేట్ చేసి బండి సంజయ్‌పై దుష్ప్రచారానికి దిగారు కొందరు బద్మాష్‌గాళ్లు.
చేతిలో ఫోన్.. అందులో డేటా ఉంది కదా అని రెచ్చిపోతున్నారు కొందరు ఆకతాయిలు. సోషల్ మీడియాలో ఫేక్‌న్యూస్‌ను విచ్చలవిడిగా సర్కులేట్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. తాజాగా మరోసారి TV9 లోగో, బ్రేకింగ్ ఫాంట్‌ను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారానికి దిగారు బద్మాష్‌గాళ్లు. యాంకర్ వాయిస్‌ను కూడా అనుకరించారు. తెలంగాణ BJP అధ్యక్షుడు బండి సంజయ్‌పై TV9లో వార్త వచ్చినట్లు కొందరు ఈ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. టీవీ9లో ప్రసారం అయినట్లుగా ఉన్న ఈ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోకి, టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారు. అలాంటి వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని TV9 హెచ్చరిస్తోంది. మరోసారి ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది.