TS Polycet 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న తెలంగాణ పాలీసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..

2022-23 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి పాలీసెట్‌ దరఖాస్తు ప్రక్రియ మే 9 (సోమవారం) నుంచి ప్రారంభమవగా.. ఈ రోజు మరికొన్ని గంటల్లో..

TS Polycet 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న తెలంగాణ పాలీసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..
Ts Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2022 | 2:41 PM

TS Polycet 2022 application last date: తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022) దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే (జూన్‌ 6) ఆఖరు. 2022-23 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి పాలీసెట్‌ దరఖాస్తు ప్రక్రియ మే 9 (సోమవారం) నుంచి ప్రారంభమవగా.. తాజాగా చివరి తేదీని జూన్‌ 6 వరకు పొడిగిస్తూ ఎస్‌బీటీఈటీ (SBTET) ప్రకటన విడుదల చేసింది. దీంతో దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ polycetts.nic.inలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250ల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. తెలంగాణ పాలీసెట్‌ 2022 ప్రవేశ పరీక్ష జూన్‌ 30న రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. హాల్‌ టికెట్లు త్వరలో విడుదలవ్వనున్నాయి.

పాలీసెట్ ఎంట్రన్స్ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పాలీసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ