Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ECET 2022: 2 రోజుల్లో ముగియనున్న తెలంగాణ ఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ.. పరీక్ష తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు రోజుల్లో (జూన్‌ 8) ముగుస్తున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌ రెండో ఏడాదిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల కోసం..

TS ECET 2022: 2 రోజుల్లో ముగియనున్న తెలంగాణ ఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ.. పరీక్ష తేదీ ఇదే..
Ts Ecet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 6:09 PM

TS ECET 2022 registration last date: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు రోజుల్లో (జూన్‌ 8) ముగుస్తున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌ రెండో ఏడాదిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల కోసం ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 20,000ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు సమయం ముగింపు లోగా అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.inలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్‌ 8 (ఆలస్య రుసుము లేకుండా)తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. రూ. 500ల ఆలస్య రుసుముతో జూన్‌ 14 వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో జులై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జులై 8న విడుదలౌతాయి.

ఇక ఈసెట్‌ పరీక్ష జూలై 13న రెండు షిఫ్టుల్లో, ఒకే రోజులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.

TS ECET 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే “TS ECET 2022 registration” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, పేర్కొన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్‌మిట్‌ చేసేముందు అన్ని వివరాలు చెక్‌ చేసుకుని, చివరిగా సబ్‌మిట్‌ చేయాలి.
  • పూరించిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, హార్డాకాపీని ప్రింట్ ఔట్‌ తీసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?