APS Golconda Jobs 2022: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే జాబ్ మీదే..!

తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Golconda Army Public School) 2022-23 విద్యాసంవత్సరానికి టీచింగ్‌ పోస్టు (Teaching and Non Teaching Posts)ల భర్తీకి ఓయూ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌..

APS Golconda Jobs 2022: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే జాబ్ మీదే..!
Aps Golconda
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 5:41 PM

Army Public School Golconda Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Golconda Army Public School) 2022-23 విద్యాసంవత్సరానికి టీచింగ్‌ పోస్టు (Teaching and Non Teaching Posts)ల భర్తీకి ఓయూ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల సంఖ్య: 8

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టీజీటీ ఇంగ్లిష్, టీజీటీ హిందీ, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ సైన్స్, టీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ కంప్యూటర్స్, కౌన్సెలర్, లైబ్రేరియన్ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.