AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Class Results 2022: రేపే ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఏప్రిల్‌) - 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ ఈ రోజు (ఆదివారం) శుభవార్త తెలిపింది. రేపు (జూన్‌ 6, సోమవారం) మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స..

AP 10th Class Results 2022: రేపే ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..
Ap Ssc Results 2022
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 06, 2022 | 6:19 AM

Share

AP SSC Result 2022 Date and Time: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఏప్రిల్‌) – 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ ఈ రోజు (ఆదివారం) శుభవార్త తెలిపింది. రేపు (జూన్‌ 6, సోమవారం) మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదగా పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌ వద్ద నున్న గేట్‌వే హోటల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

కాగా పదో తరగతి పరీక్షల ఫలితాలు తొలుత జూన్‌ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ చివరి నిముషంలో సాంకేతిక కారణాల వల్ల ఫలితాల ప్రకటనను వాయిదా వేసింది. ఈ పరీక్షలకు 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలన్నింటినీ యథాతథంగా నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.