TSRTC Apprenticeship Jobs 2022: తెలంగాణ ఆర్టీసీలో 300 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..అర్హతలు తెలుసుకోండి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అప్రెంటీస్ (ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు) పోస్టుల (Apprenticeship vacancies)కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) నోటిఫికేషన్ విడుదల..
TSRTC Apprenticeship Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అప్రెంటీస్ (ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు) పోస్టుల (Apprenticeship vacancies)కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 300
పోస్టుల వివరాలు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ట్రైనింగ్ పిరియడ్: 3 సంవత్సరాలు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మించరాదు.
స్టైపెండ్ వివరాలు:
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18000ల చొప్పున, రెండో ఏడాది నెలకు రూ.20,000ల చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.22,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
- డిప్లొమా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16000ల చొప్పున, రెండో ఏడాది నెలకు రూ.17500ల చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.19000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఈ/ బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.