ECIL Recruitment: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో డ్రైవర్ పోస్టులు.. పదో తరగతి పూర్తి చేస్తే చాలు..
ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో లైట్ వెహికిల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో లైట్ వెహికిల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే లైట్, హెవీ మోటారు వాహనాల డ్రైవిసంగ్ లెసెన్స్ కలిగి ఉండాలి. దీంతో పాటు డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష ఆధారంగా నియమిస్తారు.
* పరీక్షలో అర్హత సాధించిన వారికి డ్రైవింగ్ టెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఈమెయిల్/ ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు టెన్త్ సర్టిఫికేట్‌తో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు 25-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..