AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: కేంద్ర విద్యాశాఖ, NCERTకి సుప్రీం నోటీసులు.. 8వ తరగతి పాఠ్యపుస్తకాలపై బ్యాన్‌

న్యాయవాదుల ప్రస్తావనతో NCERT పాఠ్యపుస్తకాల వ్యవహారాన్ని సుమోటోగా CJI నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. దీంతో దిగొచ్చిన NCERT (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అనుచితమైన

Supreme Court: కేంద్ర విద్యాశాఖ, NCERTకి సుప్రీం నోటీసులు.. 8వ తరగతి పాఠ్యపుస్తకాలపై బ్యాన్‌
NCERT Textbook controversy
Srilakshmi C
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 4:56 PM

Share

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ అవినీతిమయమైనదని బోధిస్తున్నారా? అని ఎన్టీఈఆర్టీని సీజేఐ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ దాడికి, విమర్శలకు గురవుతుందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన ఎన్టీఈఆర్టీ 8వ తరతగతి సోషల్ సైన్సెస్‌ పార్ట్‌ 2 పాఠ్యపుస్తకం నుంచి పాఠాలను తొలగించింది. అయితే పాఠ్యాంశాన్ని ఉపసంహరించినా ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి పాఠ్యాంశం వెనుక కుట్ర కోణం ఉందని సీజేఐ సూర్యకాంత్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి, NCERT చైర్మన్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని నోటీసులో వివరణ కోరింది.

పాఠ్యాంశానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అందులో సూచించింది. కేంద్ర రాష్ట్ర విద్యాశాఖలు సమన్వయంతో వ్యవహరించి సర్కులేషన్ లో ఉన్న పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని తొలగించాలని, అలాగే ఫిజికల్ – డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో పాఠ్యాంశాన్ని తొలగించాలని హుకూం జారీ చేసింది. NCERT డైరెక్టర్ దీని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేసినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. ఇలాంటి వివాదాస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన రచయితల పేర్లను తక్షణమే కోర్టు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు న్యాయవాదుల ప్రస్తావనతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా CJI నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. దీంతో దిగొచ్చిన NCERT (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అనుచితమైన పాఠ్యాంశాలకు క్షమాపణలు చెప్పింది. పుస్తకాల పంపిణీని నిలిపివేసినట్లు NCERT సుప్రీంకోర్టుకు తెలిపింది. NCERT రూపొందించిన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలోని మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర అనే పాఠ్యాంశం లో అవినీతి, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం, తగినంత సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ప్రస్తావించామని ఎన్సీఈఆర్టీ తెలిపింది. అయితే పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అభ్యంతరంతో కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి

NCERT వివరణ

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (NCERT) న్యాయవ్యవస్థను అత్యున్నత గౌరవంగా భావిస్తుంది. భారత రాజ్యాంగాన్ని సమర్థించేదిగా, ప్రాథమిక హక్కుల రక్షకుడిగా భావిస్తుంది. పాఠ్యాంశంలో లోపం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, అనుచితమైన విషయాలను చేర్చడం పట్ల NCERT చింతిస్తోందని NCERT తన ప్రకటనలో పేర్కొంది. రాజ్యాంగ అక్షరాస్యత, సంస్థాగత గౌరవం, విద్యార్థులలో ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన పెంచడం కొత్త పాఠ్యపుస్తకం లక్ష్యం అని NCERT తెలిపింది. ఏ రాజ్యాంగ సంస్థ అధికారాన్ని ప్రశ్నించే లేదా తగ్గించే ఉద్దేశ్యం తమకు లేదని, NCERT నిరంతర సమీక్ష ప్రక్రియలో భాగంగా నిర్మాణాత్మక అభిప్రాయాలను స్వాగతిస్తుందని తెలిపింది. అవసరమైతే తగిన అధికార సంస్థతో సంప్రదించి పాఠ్యాంశం చేర్చబడుతుందని తెలిపింది. అనంతరం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సంస్థాగత పవిత్రత, గౌరవం కోసం నిరంతరం కృషి చేయాలన్న సంకల్పాన్ని NCERT పునరుద్ఘాటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us