YSR Aarogyasri Health Care Trust: కృష్ణా జిల్లాలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్ (Krishna District).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి..

YSR Aarogyasri Health Care Trust: కృష్ణా జిల్లాలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
Arogyasri Healthcare Trust
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 8:47 PM

Krishna YSR Aarogyasri Health Care Trust Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్ (Krishna District).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ఆరోగ్య మిత్ర పోస్టులు: 22
  • టీమ్‌ లీడర్‌ పోస్టులు: 6

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/ఫార్మా డి/బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: జిల్లా కో ఆర్డినేటర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌, కృష్ణా జిల్లా, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.