AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2022: టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

TS TET 2022 Hall Ticke: తెలంగాణ పాఠశాల విద్యా శాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల జూన్ 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు.

TS TET 2022: టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
Ts Tet 2022
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2022 | 1:52 PM

Share

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ  హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల జూన్ 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షకు మరో ఆరు రోజుల సమయమే ఉన్నందున ఇవాళ హాల్ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్లను అధికారిక టెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. TS TET హాల్ టిక్కెట్‌‌ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి.. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు వారి టెట్ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీతోె ఎంట్రీ కావచ్చు లేదా.. ఫోన్ నెంబర్ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంది. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది.

ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయవచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ మార్పులు చేసింది.

హాల్ టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

  1. అభ్యర్థులు మొదటగా టెట్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  2. అనంతరం TS TET 2022 Hall tickets లింక్ హోం పేజీలో కనిపిస్తుంది.
  3. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  4. అక్కడ Candidate Id తో పాటు సూచించిన ఇతర వివరాలను నమోదు చేయాలి.
  5. అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  6. దీంతో హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి. లేదా ప్రింట్ తీసుకోలి..

ఇక ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించడంతో పాటుగా.. ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చామని.. అందుకే దరఖాస్తులు భారీగా వచ్చాయని చెప్పారు.టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక ఇప్పటికే పూర్తైయిందని చెప్పారు. అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.