AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie collections: నవ్వుల బొనాంజాకు బాగా కలిసొచ్చిన వీకెండ్‌.. మొత్తం10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

F3 Movie collections: మే27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది

F3 Movie collections: నవ్వుల బొనాంజాకు బాగా కలిసొచ్చిన వీకెండ్‌.. మొత్తం10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
F3
Basha Shek
|

Updated on: Jun 06, 2022 | 4:41 PM

Share

F3 Movie collections: టాలీవుడ్ స్టార్‌ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (VarunTej) లు కలిసి నటించిన చిత్రం f3. గతంలో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్‌ f2 కు సీక్వెల్‌గా అనిల్‌ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌, సొనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రలు పోషించారు. బుట్టబొమ్మ పూజాహెగ్డే స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. మే27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. కాగా కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈమూవీకి వీకెండ్‌ మరింత కలిసొచ్చింది. ఫలితంగా ఆదివారం మరో రూ. 10 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్‌ అందుకుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

బ్రేక్‌ ఈవెన్‌కు సమీపంలో..

ఇవి కూడా చదవండి

కాగా f3 కలెక్షన్లతో ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చాయని మూవీ యూనిట్‌ తెలిపింది. నైజాం, గుంటూర్‌, వైజాగ్‌లలో ఇప్పటికే లాభాలు వచ్చాయని, మిగతా ప్రాంతాల్లో 80 శాతం మేర రికవరీ అయ్యిందని, బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరగా ఉందని ట్విట్టర్‌లో ప్రకటించింది చిత్రబృందం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌లోనూ f3 సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయని మూవీ యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ethanol Blending: 2025కు పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ ఉండాలి.. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్‌..

Bonalu 2022: తెలంగాణలో బోనాల జాతర.. 30న గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం..

Anil Ravipudi: తమన్నాతో గొడవలపై స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే..