ICC Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ.. లిస్టులో ఎవరెవరున్నారంటే..

ICC Awards: మే నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు క్రికెటర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది.

ICC Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ.. లిస్టులో ఎవరెవరున్నారంటే..
Icc Awards
Follow us

|

Updated on: Jun 06, 2022 | 6:42 PM

ICC Awards: మే నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు క్రికెటర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews), బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) , శ్రీలంక యువ పేసర్‌ అసిత ఫెర్నాండో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో పాకిస్తాన్‌ యంగ్ క్రికెటర్‌ తుబా హసన్, పాక్‌ కెప్టెన్‌ బిస్మా మరూఫ్, జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్‌ అవార్డు రేసులో నిలిచారు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అధ్బుతంగా రాణించాడు. మొత్తం 344 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదే టెస్టు సిరీస్‌లో ముష్ఫికర్ రహీమ్ 303 పరుగులు సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5వేల పరుగుల సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదే టెస్టు సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్‌ అసిత ఫెర్నాండో తన భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 13 వికెట్లు నేలకూల్చాడు. ఒక టెస్ట్‌లో 6/51 కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలను నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్‌ అయిన పాక్‌ కెప్టెన్‌ బిస్మా మరూఫ్, తుబా హసన్.. ఇటీవల ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. భారీగా పరుగులు సాధించారు. అదే విధంగా జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫ్రాన్స్‌పై అదరగొట్టింది. ఈక్రమంలోనే మహిళల విభాగంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. త్వరలోనే విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించనుంది ఐసీసీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Rafael Nadal Love Story: 14 ఏళ్ల పాటు ప్రేమలో.. ఆపై లగ్జరీ రిసార్ట్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌.. రఫెల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?

Godse: గాడ్సే సినిమా కోసం గొంతు సవరించుకున్న సత్యదేవ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

F3 Movie collections: నవ్వుల బొనాంజాకు బాగా కలిసొచ్చిన వీకెండ్‌.. మొత్తం10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ