Kapil Dev: పెద్ద ఆటగాళ్లైతే సరిపోదు.. ఆట కూడా ఆడాలి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్..
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీనియర్ ఆటగాళ్లు ఫామ్ జట్టును కలవరపెడుతుంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీనియర్ ఆటగాళ్లు ఫామ్ జట్టును కలవరపెడుతుంది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తిగా ఉంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ కెప్టె్‌న్, భారత్‌కు తొలిసారిగా కప్ అందించిన ఆటగాడు కపిల్ దేవ్ మాట్లాడాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఆడాలని సూచించారు. ఈ ముగ్గురూ పెద్ద ఆటగాళ్లేనని.. వారిపై భారీ అంచనాలు ఉండటం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిపారు. అది వారికి సమస్య కాకూడదన్నారు. వీరు భయం లేకుండా, ధాటిగా ఆడాలని అప్పుడే జట్టు గెలుస్తుందని చెప్పారు. కోహ్లీ, రోహిత్, రాహుల్.. 150-160 స్ట్రైక్‌రేట్‌తో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లు కానీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
పరుగులు చేయాల్సినప్పుడు ఔటవుతున్నారని. వాళ్లు క్రీజులో నిలవాలంటే మొదట కొన్ని బంతులు ఆడితే మంచిదని సూచించారు. వాళ్లు హీరోలుగా మిగలాలనుకుంటున్నారా లేక జీరోలుగా మారాలనుకుంటున్నారా అనేది ఆయా ఆటగాళ్లు, జట్టే నిర్ణయించుకోవాలని చెప్పారు. వాళ్లు తమ ఆటతీరు మార్చుకోవాలని. అది సాధ్యంకాకపోతే వారిని తప్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వాళ్లు నిజంగా పెద్ద ఆటగాళ్లే అయితే, అలాంటి ప్రదర్శనలే చేయాలని.. పేరుకే గొప్ప ఆటగాళ్లైతే సరిపోదని నొక్కి చెప్పారు. కెఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ అతను 80, 90 పరుగులు చేస్తే పర్వాలేదు. కానీ 20 ఓవర్లు ఆడి 60 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తే జట్టుకు న్యాయం చేసినట్లు కాదని చెప్పారు. భారత్ 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా ఆడనుంది. ఈ సిరీస్‌కు కెఎల్ రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు.