AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Playing 11: అభిషేక్ శర్మ ఔట్.. డేంజరస్ హిట్టర్ ఇన్.. ఇంగ్లాండ్‌పై టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?

India Likely XI vs England Semifinal: భారత జట్టు సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కొనుంది. ఈ క్రమంలో అన్ని విభాగాల్లో విఫలమైన అభిషేక్ శర్మను పక్కన పెట్టేందుకు గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుతో తలపడేందుకు ఓ బలమైన హిట్టర్ ను రంగంలోకి దింపేందుకు స్కెచ్ వేశాడు.

IND vs ENG Playing 11: అభిషేక్ శర్మ ఔట్.. డేంజరస్ హిట్టర్ ఇన్.. ఇంగ్లాండ్‌పై టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?
Team India
Venkata Chari
|

Updated on: Mar 02, 2026 | 12:50 PM

Share

Abhishek Sharma dropped Rinku Singh in: వెస్టిండీస్‌పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మార్చి 5న జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు అసలు పరీక్షగా మారనుంది.

వెస్టిండీస్‌పై తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన 97 పరుగులతో భారత్‌ను 196 పరుగుల రికార్డ్ టార్గెట్ ను చేధించేలా చేశాడు. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుత ఫామ్‌లో ఉంది.

ప్లేయింగ్ XIలో మార్పులు?

విజయం సాధించినప్పటికీ, భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనపై ఆందోళనలో ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ లోపించడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది.

ఇది కూడా చదవండి: IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?

ఇషాన్ కిషన్ ఇప్పటికే జట్టులో ఉన్న నేపథ్యంలో, అభిషేక్ శర్మను తప్పించి రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని అంచనా. రింకూ సింగ్ ఫినిషర్ పాత్రలో మెరుగైన ఎంపికగా నిలుస్తున్నాడు.

అభిషేక్ గతంలో జట్టుకు మంచి సేవలందించినప్పటికీ, ఈ కీలక మ్యాచ్ దృష్ట్యా అతనికి చిన్న విరామం ఇవ్వడం మంచిదని భావించవచ్చు. ఈ మార్పుతో తిలక్ వర్మను నంబర్-3 స్థానంలో ఆడించే అవకాశం కూడా ఉంటుంది.

బౌలింగ్ విభాగం..

బౌలింగ్ యూనిట్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ, కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ ఎక్కువ వికెట్లు సాధించలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్ ఎంపికలోకి రావొచ్చు అనే చర్చ ఉన్నప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అదే బౌలింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

భారత్ సంభావ్య ప్లేయింగ్ XI..

సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్ పోరు హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది. జట్టు ఎంపిక, వ్యూహాలు, ఆటగాళ్ల ఫామ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us