IND vs SA: ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించని ఫ్యూచర్ కెప్టెన్.. స్టార్ ఆల్‌రౌండర్ ఎక్కడంటూ ప్రశ్నల వర్షం.. అసలేమైందంటే?
గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. 7 నెలల తర్వాత తిరిగి టీమిండియాకు తిరిగొచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చల్లోకి వస్తోన్న పేరు హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ది అనండంలో ఎలాంటి సందేహం లేదు. అవును, ఎందుకంటే.. మూడు నెలల క్రితం వరకు, ఫీల్డ్‌లో చూడటం కూడా కష్టంగా ఉన్న ఆటగాడు.. తన జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి మొదటిసారి IPL 2022 టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో పాటు టీమ్ ఇండియాలో పునరాగమనం కూడా చేశాడు. ప్రస్తుతం టీమిండియా(Team India) ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్(India vs South Africa T20i Series)కు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో మొదటి రోజు హార్దిక్ పాండ్యా గైర్హాజరయ్యాడు. దీంతో అంతా షాకవుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి? అంటూ నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 9 నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగనుంది. ఇటువంటి పరిస్థితిలో, ఎక్కువ కాలం జట్టులో భాగమైన లేదా జట్టులో తమ స్థానాన్ని సంపాదించడానికి ఆసక్తి ఉన్న ఆటగాళ్లకు చాలా మంచి అవకాశం కానుంది. హార్దిక్ పాండ్యా జట్టులోని సీనియర్ విభాగంలో సభ్యుడు. ఇటువంటి పరిస్థితిలో, సోమవారం నుంచి ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించినప్పుడు, హార్దిక్ లేకపోవడం ఆశ్చర్యపరిచింది.
హార్దిక్ పాండ్యా ఎక్కడ?
ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఎక్కడ అనే ప్రశ్న తలెత్తుతోంది. వార్తా సంస్థ ANI నివేదికలో ఈమేరకు ఓ సమాధానం అందించింది. నివేదిక ప్రకారం, ఐపీఎల్ విజేత కెప్టెన్‌కు ఇంకా టీమిండియాతో కలవలేదంట. మంగళవారం జట్టుతో చేరవచ్చని పేర్కొంది. అతని ఫిట్‌నెస్ గురించి ఎలాంటి భయాందోళనలను లేవని బీసీసీఐ అధికారి అన్నట్లు తెలిపింది. అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, మొదటి మ్యాచ్‌లో మైదానంలో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.
విశ్రాంతిలో హర్షల్-చాహల్..
హార్దిక్ పాండ్యా మే 29 వరకు ఐపీఎల్‌తో బిజీగా ఉండగా, మరుసటి రోజు అహ్మదాబాద్‌లో జట్టు విజయోత్సాహంలో భాగమయ్యాడు. ఈ అలసట నుంచి కోలుకోవడానికి అతనికి ఒక రోజు అదనపు సమయం ఇచ్చారు. హార్దిక్ పాండ్యా మాత్రమే కాకుండా, మీడియం పేసర్ హర్షల్ పటేల్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ప్రాక్టీస్ సెషన్‌లో జట్టులో భాగం కాలేదు. వారిద్దరికీ విశ్రాంతి కూడా ఇచ్చారు. చాహల్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. ఫైనల్‌లోకి ప్రవేశించాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన హర్షల్ కూడా మే 27 వరకు IPLలో బిజీగా ఉన్నాడు.
First practice session ✅
Snapshots from #TeamIndia‘s training at the Arun Jaitley Stadium, Delhi. ? ? #INDvSA | @Paytm pic.twitter.com/6v0Ik5nydJ
— BCCI (@BCCI) June 6, 2022