Tim Seifert: 14 బంతుల్లో 400 స్ట్రైక్‌రేట్.. తుఫాన్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..
ఐపీఎల్ 2022లో పెద్ద అవకాశాలు దక్కించుకోలేని ఆ ప్లేయర్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక అతడెవరో కాదు న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్..
ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ కౌంటీలలో చితక్కొట్టుడు కొట్టాడు. ప్రస్తుతం అక్కడ జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ 2022లో పెద్ద అవకాశాలు దక్కించుకోలేని ఆ ప్లేయర్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక అతడెవరో కాదు న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్.. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు.
హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ సూపర్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హంప్‌షైర్.. ససెక్స్ ముందు 200 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ససెక్స్ జట్టు విఫలమైంది. ఫలితంగా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరికి ఫలితం అనుకూలంగా రాకపోయినప్పటికీ.. ఆ జట్టుకు న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ హీరోగా మారాడు. అతడి తుఫాను సెంచరీని సాధించాడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
టిమ్ సీఫెర్ట్ రెండో టీ20 సెంచరీ..
టిమ్ సీఫెర్ట్ తన టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. అతడు 84 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 56 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి బ్యాట్ నుంచి 9 ఫోర్లు, 5 సిక్సర్లు వచ్చాయి. అంటే 400 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బౌండరీల రూపంలో కేవలం 14 బంతుల్లోనే 66 పరుగులు సాధించాడు. లక్ష్యచేధనలో ససెక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. టిమ్ సీఫెర్ట్ సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు అతడికి సహకరించకపోవడంతో ఆ జట్టు 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Despite a fantastic century from Tim Seifert, it’s defeat against Hampshire Hawks. ? #SharkAttack
— Sussex Cricket (@SussexCCC) June 4, 2022