15 సిక్సర్లు, 7 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. 280 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను చీల్చి చెండాడిన 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్..

దాదాపు 280 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్.. కేవలం 49 బంతుల్లో తుఫాన్ సెంచరీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇందులో 15 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

15 సిక్సర్లు, 7 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. 280 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను చీల్చి చెండాడిన 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్..
Zeeshan Kukikhel
Follow us
Venkata Chari

|

Updated on: Jun 06, 2022 | 1:45 PM

టీ20 క్రికెట్(T20 Cricket)లో కేవలం యువ ఆటగాళ్లదే అంటుంటారు. కానీ, తాజాగా ఓ 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్ మైదానంలో చుక్కలు చూపించి మరీ, యువకులే కాదు.. సీనియర్లు కూడా దుమ్ము దులిపేస్తారంటూ చాటి చెప్పాడు. కేవలం 49 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి, బౌలర్లకు చుక్కలు చూపించాడు. హంగేరీ (Hungary) కి చెందిన 36 ఏళ్ల ఓపెనర్ జీషన్ కుకిఖేల్ (Zeeshan Kukikhel) ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ రికార్డ్ నెలకొల్పాడు. జీషాన్ కేవలం 49 బంతుల్లో 137 పరుగులు చేసి, ప్రత్యర్థుల ఆశలను నీరుగార్చాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో అతని జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. కానీ, వారికి తగిన సమాధానం వస్తుందని భావించి ఉండకపోవచ్చు. ఛేజింగ్‌లో హంగేరియన్ జట్టు, ముఖ్యంగా దాని ఓపెనర్ జీషాన్ సెంచరీతో సత్తా చాటడంతో ఘన విజయం సాధ్యమైంది.

15 సిక్సర్లు, 49 బంతుల్లో 137 పరుగులు..

ఇవి కూడా చదవండి

దాదాపు 280 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేసిన జీషన్ 49 బంతుల్లో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 15 సిక్సర్లు కొట్టడమే కాకుండా 7 ఫోర్లు బాదేశాడు. జీషన్ టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అంతకుముందు అతను కేవలం 3 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. జీషన్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 7వ మ్యాచ్‌లో తన మొదటి తుఫాన్ సెంచరీకి స్క్రిప్ట్ రాశాడు.

197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హంగేరియన్ జట్టు.. అందులో సగానికి పైగా పరుగులు ఒక్క బ్యాట్స్‌మెన్ జీషాన్ బ్యాట్‌ నుంచే రావడం విశేషం. ఆ జట్టులో రెండవ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 36 ఏళ్ల హంగేరీ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయకపోతే, జట్టు అద్భుత విజయంతో సమానమైన ఓటమిని చవిచూసేది. హంగేరీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ..

అంతకుముందు, ఆస్ట్రియా మొదట బ్యాటింగ్ చేసినప్పుడు, జీషన్ బంతితో ఒక వికెట్ తీసుకున్నాడు. అతను 33 పరుగుల వద్ద ఆస్ట్రియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మెహర్ చీమా వికెట్‌ను పడగొట్టాడు. జీషన్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 23 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. 36 ఏళ్ల హంగేరియన్ ఆటగాడు బ్యాట్, బాల్‌తో అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.