9 మంది జీరోలు.. 17కే జట్టు ఆలౌట్.. 3 పరుగులు మాత్రమే చేసిన బ్యాట్స్‌మెన్స్.. టీ20ల్లో చెత్త మ్యాచ్‌ ఇదేనేమో..

ఈ మ్యాచ్‌లో ఓ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 17 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఇందులో ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్ చేసింది కేవలం 3 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. మిగిలిన పరుగులు ఎక్కడినుంచి వచ్చాయంటే..

9 మంది జీరోలు.. 17కే జట్టు ఆలౌట్.. 3 పరుగులు మాత్రమే చేసిన బ్యాట్స్‌మెన్స్.. టీ20ల్లో చెత్త మ్యాచ్‌ ఇదేనేమో..
Cricket News
Follow us
Venkata Chari

|

Updated on: Jun 06, 2022 | 1:31 PM

టీ20 క్రికెట్‌(T20 Match)లో స్వల్ప స్కోర్‌లకే చాలా జట్లు పెవిలియన్ చేరి, కోరుకోని చెత్త రికార్డులో చేరాయి. ప్రస్తుతం మాట్లాడుకోబోయే మ్యాచ్‌లోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయింది. లక్ష్యం చాలా చిన్నది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. అత్యల్ప స్కోర్‌కే పరిమితం అవ్వడంతో.. ఆ తర్వాత లక్ష్యాన్ని కేవలం 2.2 ఓవర్లలోనే మరోజట్టు ఛేదించింది. అసలు లక్ష్యం ఏమిటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. తొలుత బ్యాటింగ్ చేసి జట్టు కేవలం 18 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. హాంప్‌షైర్ క్రికెట్ లీగ్(Hampshire Cricket League) డివిజన్ 6 మ్యాచ్‌లో, ఇద్దరు బౌలర్లు కలిసి ప్రత్యర్థి జట్టును చాలా దారుణంగా దెబ్బ తీశారు. దీంతో బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో నిలవడమే కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌ ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్, ఓవర్టన్ క్రికెట్ క్లబ్ (Overton CC) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఓవర్టన్ క్రికెట్ క్లబ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. కానీ, వారి ఆట అనుకున్నట్లుగా సాగలేదు. ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు మొత్తం జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఆ జట్టు పరిస్థితి విషమంగా తయారైంది.

9 మంది బ్యాట్స్‌మెన్స్ జీరోలే.. 17 పరుగులకే ఆలౌట్..

ఇవి కూడా చదవండి

ఓవర్టన్ క్రికెట్ క్లబ్‌కు చెందిన 9 మంది బ్యాట్స్‌మెన్స్ ఖాతా తెరవలేకపోయారు. అలా క్రీజులోకి వచ్చి ఇలా వెళ్లారు. మిగిలిన ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కూడా భారీ స్కోర్ చేయలేక చేతులెత్తేశారు. వీరిద్దరూ కలిసి కేవలం 3 పరుగులు మాత్రమే చేశారు. మళ్లీ 17 పరుగులు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కూడా ఓ షాకింగ్ నిర్ణయం ఉంది. అందేంటంటే.. ఓవర్టన్ క్రికెట్ క్లబ్ జట్టు కంటే ప్రత్యర్థి జట్టు స్కోరింగ్‌లో ఎక్కువ సహకారం అందించింది. ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్ మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లు.. మొత్తం 11 వికెట్లు కూడా తీశారు. అయితే, వీరిద్దరు అదనంగా 14 పరుగులు ఇచ్చారు. దీని కారణంగా ఓవర్టన్ స్కోరు బోర్డు 3 నుంచి 17 పరుగులకు చేరింది.

ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్ బౌలర్ సోఫీ కుక్ 5.3 ఓవర్లలో 4 పరుగులకు 7 బ్యాట్స్‌మెన్‌లను లక్ష్యంగా చేసుకోగా, మిగిలిన 3 వికెట్లను జాయ్ వాన్ డెర్ ఫ్లైయర్ 6 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి పడగొట్టాడు. అంటే ఓవర్టన్ జట్టు మొత్తం 11.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది.

2.2 ఓవర్లలో 18 పరుగులు..

ఒడిషామ్ & గ్రావెల్ క్రికెట్ క్లబ్‌కు 18 పరుగుల లక్ష్యం ఉంది. కేవలం 14 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి సాధించారు. అంటే ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఇద్దరు ఓపెనర్లలో ఒకరు 6 పరుగులు చేసి మరొకరు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.