AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Potato: మార్కెట్లో దొరికే నకిలీ స్వీట్ పొటాటోలివి.. వీటిని కొని తెచ్చుకున్నారో అంతే సంగతులు.. !

చిలగడదుంప లేదా గెనుసు గడ్డ.. ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం. ఫైబర్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే ఈ దుంపలను మనం ఎంతో ఇష్టంగా తింటాం. అయితే, మన ఆరోగ్యంతో ఆటలాడుకోవడానికి కొందరు వ్యాపారులు వీటికి రసాయన రంగులు పూసి విక్రయిస్తున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ దుంపలు వాస్తవానికి మీ శరీరంలోకి విషాన్ని పంపే అవకాశం ఉంది. మరి మీరు కొన్న చిలగడదుంప అసలైనదా లేక రంగులు పూసిన నకిలీదా? ఇంటి వద్దే సింపుల్ టెక్నిక్స్‌తో ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం.

Sweet Potato: మార్కెట్లో దొరికే నకిలీ స్వీట్ పొటాటోలివి.. వీటిని కొని తెచ్చుకున్నారో అంతే సంగతులు.. !
Whatsapp Image 2026 02 26 At 7.09.31 Pm
Bhavani
|

Updated on: Feb 26, 2026 | 7:41 PM

Share

పోషకాల గని అయిన చిలగడదుంప ఇప్పుడు కల్తీ మాఫియా చేతిలో చిక్కుకుంది. ముదురు ఎరుపు, నారింజ రంగుల్లో ప్రకాశవంతంగా కనిపించే దుంపల వెనుక రసాయనాల ముప్పు పొంచి ఉంది. మార్కెట్లో దొరికే నకిలీ స్వీట్ పొటాటోలను గుర్తించడానికి మీరు పెద్ద పెద్ద ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నీరు, నూనె కొద్దిపాటి అవగాహన ఉంటే చాలు. కల్తీని ఇట్టే పట్టేసే ఆ అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు మీ కోసం..

1. కాటన్ బాల్ టెస్ట్ (అత్యంత ప్రభావవంతమైనది)

ఒక చిన్న దూది ఉండ (Cotton Ball) తీసుకోండి. దానిని నీటిలో లేదా వెజిటబుల్ ఆయిల్‌లో నానబెట్టి, దుంప పైభాగంలో బలంగా రుద్దండి. ఒకవేళ ఆ దూదికి రంగు అంటుకుంటే, ఆ దుంపకు రసాయన రంగులు పూశారని అర్థం. అసలైన చిలగడదుంప అయితే రంగు మారదు.

2. రంగును బట్టి గుర్తింపు

సహజంగా పెరిగిన చిలగడదుంపలు కొద్దిగా లేత రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో రంగు వేసినవి సాధారణం కంటే చాలా ప్రకాశవంతంగా, ముదురు ఎరుపు లేదా గాఢమైన నారింజ రంగులో కనిపిస్తాయి. చూడగానే ఆకర్షణీయంగా ఉండే దుంపల పట్ల జాగ్రత్తగా ఉండండి.

3. నీళ్లలో నానబెట్టడం

దుంపలను వండడానికి ముందు కాసేపు నీళ్లలో నానబెట్టండి. కొద్దిసేపటి తర్వాత ఆ నీరు రంగు మారినా లేదా నీటిపై రంగు పొరలు తేలినా అది కచ్చితంగా కల్తీ జరిగిందని గుర్తించాలి.

4. మరగబెట్టినప్పుడు వచ్చే రంగు

చిలగడదుంపను నీళ్లలో మరగబెట్టినప్పుడు ఆ నీరు ముదురు గోధుమ రంగులోకి మారితే, అందులో రసాయనాలు ఉన్నాయని భావించాలి. సహజమైన దుంపను ఉడికించినప్పుడు నీరు అంతటి ముదురు రంగులోకి మారదు.

5. రుచి ద్వారా నిర్ధారణ

ఉడికించిన చిలగడదుంప తిన్నప్పుడు కాస్త చేదుగా అనిపించినా, వింత రుచి వచ్చినా లేదా గొంతులో మంటగా అనిపించినా వెంటనే దానిని పక్కన పడేయండి. అది రసాయనాల ప్రభావమే అని గుర్తించండి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన తెలిపిన చిట్కాలను పాటించి కల్తీ లేని ఆహారాన్ని ఎంచుకోండి. సందేహం ఉంటే ఆహార భద్రతా నిపుణులను సంప్రదించండి.

Follow Us