Tollywood : 25 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్.. అయినా తగ్గని డిమాండ్.. రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ మేడమ్..
బాలనటిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కథానాయికగానూ మెప్పించింది. దాదాపు 25 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినిమా పరిశ్రమలో కథానాయికగా ఒక ముద్ర వేయడం చాలా కష్టమైన పని. అలాగే స్టార్‌డమ్‌కు ఎదగడం , ఆ స్థాయిని కాపాడుకోవడం మరింత శ్రమతో కూడుకున్న పని. కానీ అవన్నీ సాధించిన వారు కొందరు ఉన్నారు. వారి నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం బాలనటిగా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ మెప్పించింది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. బేబీ షాలిని.. ఆమెను మలయాళ సినిమా చరిత్రలో అతిపెద్ద ‘చైల్డ్ సూపర్ స్టార్’ అని అంటారు. ఆమె చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటించకపోయినా, ఆమెకు ఇప్పటికీ భారీ అభిమానులు ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
నవంబర్ 20, 1979న జన్మించిన షాలిని చిన్నప్పటి నుండే నటనపై ఆసక్తి పెంచుకుంది. దర్శకుడు ఫాసిల్ దర్శకత్వం వహించిన ‘ఎంతే మమ్మట్టుకుట్టియమ్మక్కు’ (1983) అనే కుటుంబ చిత్రంతో ఆమె కెరీర్ మారిపోయింది. ఈ చిత్రం థియేటర్లలో ఒక సంవత్సరం పాటు రన్ అయ్యింది. ఆమెకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా సంపాదించిపెట్టింది. తక్కువ సమయంలోనే, బేబీ షాలిని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనతో పాటు, ఆమె హెయిర్ స్టైల్ సైతం చాలా పాపులర్ అయ్యింది. మొదటి సినిమాకు రూ.4000 పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోనూ షాలిని నటించింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
1997 లో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఫాసిల్ దర్శకత్వం వహించిన ‘అనియాతిబ్రావు’ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. మాధవన్ సరసన సఖి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. అమర్కాలం చిత్రంలో అజిత్, షాలిని కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు ఏప్రిల్ 2000 లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన షాలిని.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
