AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 52 ఏళ్ల వయసులో 33 ఏళ్ల కుర్రాడితో రొమాన్స్.. రెండుసార్లు బ్రేకప్.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే మతిపోద్ది..

ఒకప్పుడు ఆమె పాన్ ఇండియా లెవల్లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్. స్పెషల్ పాటలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చ చేసింది. తక్కువ సమయంలోనే విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా ఆమె పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు ఆమె డేటింగ్, ప్రేమ వ్యవహారాల గురించి నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది.

Tollywood : 52 ఏళ్ల వయసులో 33 ఏళ్ల కుర్రాడితో రొమాన్స్.. రెండుసార్లు బ్రేకప్.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే మతిపోద్ది..
Malaika Arora Pics
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 6:38 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సంచలనం. స్పెషల్ పాటలతోనే పాపులర్ అయ్యింది. అద్భుతమైన ఫిట్నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు అంతగా సినిమాలు చేయకపోయినా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఆమె పేరు మలైకా అరోరా. కొన్ని రోజుల క్రితం అర్జున్ కపూర్ తో ప్రేమ, డేటింగ్ అంటూ నెట్టింట వైరల్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరి మధ్య వయసు 11 సంవత్సరాల వ్యత్యాసం. మలైకా అరోరా అర్జున్ కంటే 11 సంవత్సరాలు పెద్దది. మలైకా గతంలో అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వారికి అర్హాన్ అనే 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరూ 2017 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అయితే, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 2024 లో ఇద్దరూ విడిపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మలైకా తనకంటే 19 సంవత్సరాలు చిన్న యువకుడిని ప్రేమిస్తుంది. అతడి పేరు హర్ష్ మెహతా. ముంబైకి చెందిన చాలా ప్రసిద్ధ వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందినవాడు. ప్రస్తుతం అతని వయస్సు 33 సంవత్సరాలు. అతడు తన కుటుంబం లాగే వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. హర్ష్ మెహతా గత కొంతకాలంగా 53 ఏళ్ల మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ విమానాశ్రయంలో, కచేరీలలో కలిసి కనిపించారు. గత అక్టోబర్‌లో ముంబైలో జరిగిన ఒక కచేరీకి వారు కలిసి హాజరయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఇక ఇప్పుడు ఇటలీలోని ట్రెవీ ఫౌంటెన్ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరూ ఇటలీలో విహారయాత్రకు వెళ్లారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు మలైకా లేదా హర్ష్ మెహతా డేటింగ్ రూమర్స్ పై స్పందించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

View this post on Instagram

A post shared by ELLE India (@elleindia)

Malaika Arora

Malaika Arora

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Follow Us