AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:ఈ హీరోయిన్ మనసూ అందమైనదే.. పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన స్టార్ నటి

సినిమాల సంగతి పక్కన పెడితే తరచూ వివాదాలతో వార్తల్లో నిలవడం ఈ ముద్దుగుమ్మకు పరిపాటి. చాలా సార్లు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోలింగ్ కు గురైందీ అందాల తార. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన ఓ మంచి పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tollywood:ఈ హీరోయిన్ మనసూ అందమైనదే.. పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన స్టార్ నటి
Actress Urvashi Rautela
Basha Shek
|

Updated on: Feb 26, 2026 | 6:14 PM

Share

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కేక్ కటింగ్స్, విందులు, వినోదాలు, పార్టీలు ఇలా చాలానే ఉంటాయి. ఇక సెలబ్రిటీల బర్త్ డే అంటే అన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. అయితే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా చాలా మంది తమ పుట్టిన రోజును సేవా కార్యక్రమాలకు వేదికగా వినియోగించుకుంటున్నారు. పేదలు, అనాథలకు అన్నదానం, దుస్తులు పంచడం వంటి తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి గొప్ప పని చేసి అందరి మన్ననలు అందుకుంటోంది బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా. తన 31వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా బాగేశ్వర్ ధామ్‌లో 251 మంది పేద అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి అందరి మనసులు గెలుచుకుంది. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్న ఊర్వశి అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా ఊర్వశినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఊర్వశిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

హిందీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది ఊర్వశి. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ అందాల తార. వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద, ఏజెంట్, డాకు మహారాజ్ లో ఈ బ్యూటీ చేసిన సాంగ్స్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. మరీ ముఖ్యంగా డాకు మహారాజ్ మూవీలో బాలయ్యతో కలిసి ఊర్వశి స్టెప్పులు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితమే ఊర్వశి ప్రధాన పాత్రలో బ్లాక్ రోజ్ అనే పేరుతో ఓ తెలుగు సినిమాను అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే హిందీలో మాత్రం ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

251 మంది పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం..

వీడియో ఇదిగో..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us